
అంతేకాదు సీనియర్ ఏజ్ వచ్చిన సరే ఇప్పటికి పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హ్యాండ్ సమ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు నాగార్జున. అలాంటి నాగార్జునను అందరూ నాగ్ , నాగి ఇలానే పిలుస్తూ ఉంటారు . కానీ నాగార్జునకి ఒక ముద్దు పేరు ఉంది . అది చాలా తక్కువ మందికి తెలుసు . అది కూడా "మనం" సినిమా తర్వాతనే అందరూ పిలవడం స్టార్ట్ చేశారు . "మనం: సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఎంత స్పెషల్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో నాగార్జున.. నాగేశ్వరరావు ..అఖిల్ ..నాగచైతన్య.. సమంత ..అమల కలిసి నటించి మెప్పించారు.
ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ పేరు "బిట్టు". బిట్టు అన్న పేరు ఆయనకు చాలా చాలా ఇష్టమట . బిట్టు అన్న పేరుతోనే ఆయనని చాలామంది పిలుస్తూ ఉంటారట . మరి ముఖ్యంగా నాగార్జునకు కావాల్సిన వాళ్ళు దగ్గరగా ఆయనను గమనించేవాళ్ళకి ఇది బాగా తెలుసు. ఆయనను ఆయన ఫ్రెండ్స్ బిట్టు అంటే ప్రేమగా ఆప్యాయంగా పిలుస్తారట. ప్రజెంట్ తన 100వ సినిమా కోసం కష్టపడుతున్నాడు నాగార్జున . అంతేకాదు రీసెంట్ గానే నెగిటివ్స్ షేడ్స్ లో నటించిన "కుబేర" సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు నాగార్జున "కూలీ" సినిమాలో నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నాడు . మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే..??