సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అంటే కచ్చితంగా రష్మిక ,నయనతార ,అనుష్క, సమంత ,సాయి పల్లవి తదితర హీరోయిన్స్ అని చెబుతూ ఉంటారు. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటూ భాషతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి సినిమా అవకాశాన్ని అందుకుంటూ నటిస్తూ దక్షిణాదిలోనే రిచెస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు, తమిళం భాషలలో కూడా పలు చిత్రాలలో నటించింది ఈ హీరోయిన్ ఆమె ఎవరో కాదు హీరోయిన్ జ్యోతిక.


1998 డాలి సజాకే రక్నా ఈ చిత్రంతోనే తన సినీ కెరియర్ ను  మొదలుపెట్టిన జ్యోతిక ఆ తర్వాత తమిళ్, తెలుగు భాషలలో కూడా నటించింది. అలా ఎంతో మంది అగ్ర హీరోలతో నటించడం జ్యోతిక కోలీవుడ్ హీరో సూర్యని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు, పాపు కూడా ఉన్నారు. ఇక జ్యోతిగా ఇప్పుడిప్పుడే తిరిగి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది. ఎక్కువగా ఈమె హిందీలోనే సినిమాలు చేస్తోంది. ఇదంతా ఇలా ఉండగా కొన్ని నివేదికల ప్రకారం జ్యోతిక ఆస్తి విలువరూ .330 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.


అలాగే హీరో సూర్య ఆస్తి కూడా 200 కోట్లకు పైగా ఉంటుందని ఇలా ఇద్దరి మొత్తం ఆస్తి విలువ 530 కోట్లకు పైగా ఉంటుందని కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. జ్యోతిక తను నటించే ఎలాంటి పాత్రకైనా సరే రూ.5కోట్ల రూపాయలు తీసుకుంటున్నదట. అలాగే రియల్ ఎస్టేట్ ,పలు రకాల వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. బ్రాండ్స్ ప్రమోషన్స్ తో భారీగానే సంపాదిస్తున్నారు. సూర్య కూడా ఒక్కో చిత్రానికి సుమారుగా 30 నుంచి 50 కోట్ల వరకు అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే సౌత్ ఇండస్ట్రీ లోనే రిచెస్ట్ హీరోయిన్గా జ్యోతిక కూడా పేరు సంపాదించిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: