కార్తీ హీరోగా 2019లో వచ్చిన ‘ఖైదీ’ తెలుగు, తమిళ ప్రేక్షకులపై ఊహించని స్థాయిలో ప్రభావం చూపింది. రిలీజ్‌కు ముందు ఎలాంటి హైప్ లేకపోయినా, ఆ సినిమా కేవలం కంటెంట్ బలంతో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఒకే లొకేషన్‌లో, ఒక్క రాత్రి జరిగే కథ… హీరోకి హీరోయిన్ లేకుండా, పాటలు లేకుండా కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అదే లోకేష్ కనగరాజ్‌కు గేమ్‌చేంజర్‌గా మారింది. అసలు ప్లాన్ ప్రకారం ‘ఖైదీ 2’ మరుసటి ఏడాదే మొదలవ్వాలి. కానీ, లోకేష్ తర్వాతి ప్రాజెక్టులు ‘మాస్టర్’, ‘విక్రం’, ‘లియో’, ఇప్పుడు ‘కూలీ’ వరుసగా బిజీగా ఉండటంతో ‘ఖైదీ 2’ వాయిదా పడుతూ వచ్చింది.


ఇక ఇప్పుడు పరిస్థితులు మారాయి. రేపే ‘కూలీ’ విడుదల కానుంది. ఆ వెంటనే లోకేష్ ఫుల్ ఫోకస్ ‘ఖైదీ 2’ మీదే. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తైందని సమాచారం. అయితే ఇది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. అంటే ‘ఖైదీ’లో మనం చూసిన కథకు ముందు జరిగిన అసలు నిజం. ‘ఢిల్లీ’ (కార్తీ) జైలులోకి ఎలా వెళ్లాడు? ఆ రోజు ఏమి జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే ‘ఖైదీ 2’.మొదటి పార్ట్‌లో కార్తీ ఒక్కడే స్టార్ అయితే, ఈసారి మాత్రం స్టార్‌ల పరంపర కనిపించనుంది. లోకేష్ యూనివర్స్‌లో ఉన్న విక్రం, లియో, కూలీ మూవీల పాత్రలు కూడా ఈ సినిమాలో ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. అంటే ‘ఖైదీ 2’ కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా, LCU (Lokesh Cinematic Universe) ఫ్యాన్స్‌కు ఒక పెద్ద ట్రీట్ అవుతుంది. ఒకేసారి పలువురు స్టార్ క్యారెక్టర్లు తెరపై కనిపిస్తే వచ్చే హై వేరే ఉంటుంది.



మరియు, ఈసారి ‘ఖైదీ 2’లో హీరోయిన్ కూడా ఫిక్స్ అయిందని టాక్. ఆ ఛాన్స్ సౌత్ క్వీన్ స‌మంతకే దక్కబోతోందని చెన్నై సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా సామ్‌కు పెద్ద ప్రాజెక్ట్ దొరకలేదు. ‘ఖైదీ 2’తో ఆమెకు మళ్లీ మాస్ ఆడియెన్స్ కనెక్ట్ కచ్చితమని ట్రేడ్ టాక్. మొత్తం మీద, ‘కూలీ’ తర్వాత లోకేష్ ప్లాన్ స్పష్టంగా ఉంది – యాక్షన్, మాస్, ఎమోషన్ మిక్స్ చేసి LCUని మరింత విస్తరించడం. ‘ఖైదీ 2’లో కార్తీతో పాటు స్టార్‌ల వర్షం కురిస్తే, ఇది కేవలం సౌత్‌లో కాదు, పాన్ ఇండియా లెవెల్లో హడావుడి చేయడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: