
వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇంతకుముందు రాహుల్‌ను - హరిణ్యా రెడ్డితో ఎక్కడా చూడలేదు. ఆమె ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌కి చెందినది కూడా కాదు అంటూ మాట్లాడుకున్నారు. వీరిద్దరి పరిచయం ఎలా ఏర్పడింది? లవ్ ఎలా మొదలైంది? అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఫైనల్‌గా ఆ అమ్మాయి ఎవరో బయటపడింది. రాహుల్ సిప్లిగంజ్ ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న ఆ అమ్మాయి మరెవరో కాదు .. టీడీపీ సీనియర్ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి కూతురే.
2020లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరి పరిచయం మొదలైంది. మొదట ఫ్రెండ్స్‌గా ఉన్న వీరి సంబంధం క్రమంగా ప్రేమగా మారింది. గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హరిణ్యా "బిగ్ బాస్" నిర్వహించే "ఎండెమాల్ షైన్" కంపెనీలో ప్రొడ్యూసర్‌గా పనిచేసింది. అక్కడే వీరి ప్రేమకు బీజం పడింది. ప్రస్తుతం ఆమె ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నట్లు టాక్. అంతేకాదు హరిణ్యా చాలా టాలెంటెడ్ అని కూడా తెలుస్తోంది. హరిణ్యా కుటుంబం మొత్తం నందమూరి బాలకృష్ణకు సన్నిహితులు అని ఓ న్యూస్ కూడా బయటకు వచ్చింది. దీంతో రాహుల్‌కి సినిమా, పొలిటిక్స్ రెండు వైపులా బలమైన బ్యాక్‌గ్రౌండ్ లభించింది అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.