
అయితే కావాలనే కొందరు ఈ సినిమా ఫ్లాప్ చేశారు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. నిజంగానే ఈ సినిమాలో అంత మేటర్ లేదు అని కూడా కొంతమంది ఓపెన్‌గా స్పందిస్తున్నారు. ఎవరు ఎలా ఉన్నా, టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి వెళ్ళిన ప్రతి హీరో తమ ఫస్ట్ సినిమాతోనే ఫ్లాప్ అయిన విషయం మరోసారి ట్రెండ్ అయ్యింది. మొదట చరణ్..ఆ తరువాత ప్రభాస్, తర్వాత జూనియర్ ఎన్టీఆర్—ఇలా లిస్ట్ కొనసాగుతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్‌ని చూసిన తర్వాత, “తర్వాత ఏ హీరో బాలీవుడ్‌కి వెళ్లి ఆ మాయలకు బలవుతాడా?” అన్న చర్చ హైలైట్‌గా మారింది. సోషల్ మీడియాలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది.
అల్రెడీ పుష్ప 2 తర్వాత, సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో బన్నీ ఒక సినిమాలో నటించబోతున్నాడనే టాక్ వినిపించింది. ఇది దాదాపు కన్ఫర్మ్ అని బాలీవుడ్ మీడియా చెబుతోంది. అంతేకాదు, బన్నీ అగ్రిమెంట్ పేపర్స్‌పై సైన్ కూడా చేసేశాడట. ఇందులో నెగిటివ్ రోల్ చేస్తున్నాడనే సమాచారం ఉంది. బన్నీకి ఏమని చెప్పి ఈ సినిమాను ఒప్పించాడో సంజయ్ లీలా భన్సాలికి మాత్రమే తెలుసు. కానీ కెరీర్‌లో నెగిటివ్ రోల్ చేయడానికి అల్లు అర్జున్ సైన్ చేశాడు అనే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి ఆ మాయలకు బలవబోతున్న హీరో బన్నీయే అని చాలాకాలంగా వార్తలు వినిపించాయి. ఫైనల్లీ అదే నిజం కాబోతుందన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ - అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్స్‌తో మంచి రిలేషన్ కూడా పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో నెగిటివ్ రోల్‌లో బన్నీ కనిపించబోతున్నాడన్న వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.