
తమిళ డైరెక్టర్ మురగదాస్ స్టాలిన్ చిత్రాన్ని దర్శకత్వం వహించగా 2006లో విడుదలయ్యింది. ఇందులో చిరంజీవికి జోడిగా త్రిష నటించిన అప్పట్లో ఈ సినిమా మిశ్రమ స్పందనాన్ని అందుకుంది. కానీ మురగదాస్ ఇందులో తీసుకున్న పాయింట్ కాస్త భిన్నంగా ఉండడంతో పాటుగా పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే జనాలకు ఎక్కుతుందని నిర్మాతలు అనుకున్నప్పటికీ బర్తడే కానుకగా 4K లో విడుదల చేశారు. అయితే బుకింగ్స్ ను ఓపెన్ చేసినప్పుడే చాలా పేలవమైన స్పందన లభించింది.
చాలా చోట్ల తగినంత మంది ప్రేక్షకులు లేకపోవడం వల్ల షోష్ కూడా క్యాన్సిల్ చేసినట్లు ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. దీంతో చిరంజీవి బర్త్డే రోజున స్టాలిన్ సినిమా పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ నాగార్జున బర్తడే కానుకగా ఆగస్టు 29న రగడ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఆ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ అభిమానులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్టాలిన్ సినిమా లాగే రగడ సినిమా కూడా మొదటిసారి సో సో గానే అనిపించుకుంది. మరి రీ రిలీజ్ లో ఏం జరుగుతుందో చూడాలి. వాస్తవానికి సీనియర్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ సమయంలో పెద్దగా ప్రేక్షకుల ఆదరణ నోచుకోవడం లేదని బయ్యర్లు కూడా తెలుపుతున్నారు. అలా బాలకృష్ణ నటించిన భైరవద్వీపం సినిమా విషయంలో కూడా భారీగా ప్రచారం చేసిన నష్టమే వచ్చిందంటున్నారు నిర్మాతలు. మరి ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇక మీదట రీ రిలీజ్ సంప్రదాయాలకు స్వస్తి పలుకుతారేమో చూడాలి మరి.