టాలీవుడ్ ప్రముఖ నిర్మాత గా పేరుపొందిన దాసరి కుమార్ ను ఇటీవలే అరెస్ట్ కూడా చేశారు. ముఖ్యంగా తమ వద్ద డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించకుండానే మోసం చేస్తున్నారంటూ దాసరి కిరణ్ కుమార్ పైన ఆయన బంధువులు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో అరెస్టు చేయడం జరిగింది. అయితే వెంటనే బెయిల్  పైన బయటికి వచ్చిన దాసరి కిరణ్ పై వరుసగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ నిర్మాత పైన సుమారుగా మూడు కేసులు వరకు నమోదైనట్లుగా తెలుస్తోంది.


ఇప్పుడు తాజాగా దాసరి కిరణ్ కుమార్ పైన మరో రెండు కేసులు నమోదైనట్లుగా టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గాజుల మహేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ రెండు కేసులు దాసరి కిరణ్ పైన నమోదు అయ్యాయని.. అలాగే హైదరాబాదులో ప్రగతి నగర్ కి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయిన శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కూడా మరొక కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. దాసరి కిరణ్ తమ వద్ద రూ.58 లక్షల రూపాయలు తీసుకొని స్థలం అమ్మి రిజిస్ట్రేషన్ చేయించకుండా తిరుగుతున్నారని.. ఈ విషయంపై  ప్రశ్నిస్తే కిరణ్ పైన దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారని శివ తెలియజేశారు.


అలాగే హైదరాబాద్ రాజేంద్రనగర్ కు చెందిన కోటా శశికాంత్ దగ్గర కూడా రూ .53 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండానే మోసం చేస్తున్నారని తిరిగి ప్రశ్నిస్తే తన అనుచరులతో కిరణ్ దాడి చేయించడంతో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసి కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఇప్పుడు కిరణ్ పైన వరుసగా నమోదవుతున్న కేసుల సంఖ్య సుమారుగా 5 కు చేరింది. దీంతో పోలీసులు కూడా దాసరి కిరణ్ ని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పై కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: