తమిళంలో స్టార్ హీరోగా పేరుపొందిన విశాల్ తన ప్రతి సినిమాని కూడా తెలుగులో విడుదల చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. అలా ఎన్నో చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న విశాల్ తెలుగులో కూడా మంచి మార్కెట్ అందుకున్నారు. తాజాగా తన 35వ సినిమాని ప్రకటించారు. ఆ సినిమాకి టైటిల్ "మకుటం" అంటూ ప్రకటించారు. తాజాగా చిత్ర బృందం టైటిల్ టీజర్ ని విడుదల చేసింది. ఈ టైటిల్ టీజర్ ప్రేక్షకులను, అభిమానులను బాగా ఆకట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.



టైటిల్ టీజర్ విషయానికి వస్తే.. సముద్రం, పోర్టు ఏరియా నేపథ్యంలో సాగే సినిమా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. టీజర్ ను చాలా అద్భుతంగా చూపించారు. టీజర్ ప్రారంభంలోనే సముద్రంలోని చేపలు, భారీ సొర చేపలను చూపిస్తూ ఒక ఆక్టోపస్ భారీ ఓడను ఎక్కుతూ పైకి రావడం వంటి విజిల్స్ ని అద్భుతంగా చూపించారు. జనం కేకలు, కేరింతల మధ్య విశాల్ చేతిలో ఒక సిగరెట్టు పట్టుకొని డాన్ గా కనిపించడం  హైలెట్ గా కనిపిస్తూ ఉన్నట్టు టైటిల్ టీజర్ లో కనిపిస్తోంది. విశాల్ గతంలో ఎన్నడు కనిపించని తీరులో ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే పోర్ట్ ఏరియాలో ఆధిపత్యం కోసం సాగేటువంటి సినిమా కథ అన్నట్టుగా కనిపిస్తోంది.


ఈ చిత్రాన్ని డైరెక్టర్ రవి అరసు డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు .జీవి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా హీరోయిన్గా దుషార విజయన్ నటిస్తోంది. అలాగే మరొక హీరోయిన్ అంజలి కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు  తెలుస్తోంది.. గతంలో కూడా అంజలి, విశాల్ కాంబినేషన్లో మదగజరాజా అనే సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మకుటం సినిమాతో ఇప్పుడు వీరి కాంబినేషన్లో రెండవ సినిమాగా రాబోతోంది. సూపర్ గుడ్ ఫిలిం బ్యానర్ పైన ఈ చిత్రాన్ని 99 వ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: