
మదరాసి సినిమా ట్రైలర్ మొత్తం కూడా పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లోనే కనిపిస్తోంది. ఇందులో హైలెట్గా శివ కార్తికేయన్ యాక్షన్స్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ చూసి నెటిజన్స్ సైతం మరీ ఇంతటి వైలెన్స్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమిళనాడులోకి ఇల్లీగల్ గన్స్ వ్యవహారం పైన ఈ సినిమా కథ నడిపించినట్లుగా తెలుస్తోంది. అలాగే రుక్మిణి వసంత్ కూడా హీరోయిన్గా అద్భుతంగా ఆకట్టుకున్నట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. అలాగే విద్యుత్ జామ్వాల్, షబ్బీర్, విక్రాంత్, బిజు మీనన్ వంటి వారు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించగా ట్రైలర్లో బాగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళం భాషలలో పాటుగా ఇతర భాషలలో కూడా మదరాసి సినిమా విడుదల కాబోతోంది. తెలుగులో కూడా శివ కార్తికేయన్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉన్నది.. అమరాన్ చిత్రం కూడా విడుదలై తెలుగులో మంచి విజయాన్ని కూడా అందుకున్నది. మరి ఇప్పుడు రాబోతున్న మదరాసి సినిమాతో ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి. వాస్తవానికి ఎప్పుడూ కూడా శివ కార్తికేయన్ ఫ్యామిలీ చిత్రాలనే ఎంచుకొనేవారు. కానీ ఇలా మొదటిసారి ఇంతటి వైలెన్స్ ఉండే పాత్రలలో నటిస్తూ ఉన్నారు.