టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తను నటిస్తున్న సినిమాలన్నీ డిజాస్టర్ గా మారిపోతున్నాయనే విధంగా వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన కింగ్డమ్ సినిమా పరవాలేదు అనిపించుకున్న కానీ అభిమానులు ఆశించిన స్థాయిలో ఆడలేదని విధంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లాంగ్ రన్ టైంలో ఈ సినిమా చేతులెత్తేసినట్లుగా సమాచారం. దీంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆశలు మొత్తం కూడా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ మీదనే ఆధారపడిందట. గతంలో వీరు కాంబినేషన్లో టాక్సీవాలా సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నది.


అయితే ఇందులో రష్మిక నటిస్తూ ఉండడం మరొక విశేషము. విజయ్ దేవరకొండ కి రష్మిక అంటే ఒక సెంటిమెంట్ అని చెప్పవచ్చు. గతంలో కూడా వీరి కాంబినేషన్లో గీతా గోవిందం సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా హైలెట్ గా ఉంటుందని అభిమానులు కూడా భావిస్తూ ఉంటారు. అందుకే రష్మిక సెంటిమెంటుతోనే తనను హిట్ ట్రాక్ ఎక్కిస్తుందనే నమ్మకాన్ని విజయ్ నమ్ముతున్నారని విధంగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.



అంతేకాకుండా డైరెక్టర్ రాహుల్ మీద ఉండే నమ్మకంతోనే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలా అన్ని విధాలుగా కూడా ఈసారి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని రంగంలోకి దిగుతున్నారు విజయ్ దేవరకొండ. దీన్నిబట్టి చూస్తూ ఉంటే విజయ్ భారమంతా కూడా హీరోయిన్ రష్మికనే మోసేలా కనిపిస్తోంది. కాబట్టి ఈసారి విజయ్ హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి కింగ్డమ్ సినిమా సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: