ప్రస్తుతం ఈ వార్త సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా రెబెల్ స్టార్ ప్రభాస్‌కు సంబంధించిన ఏ వార్త అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం విషయం ఆయన పెళ్లి గురించి కాదు, ఆయన సినిమాల గురించి కూడా కాదు. ప్రభాస్ వ్యక్తిగత విషయమే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. సాధారణంగా సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి వైరల్ అయ్యే వార్తలు ఆయన పెళ్లి గురించో లేక ఆయన సినిమాలకు సంబంధించిన టీజర్, ట్రైలర్ అప్డేట్స్ గురించో ఉంటాయి. కానీ ఫస్ట్ టైమ్‌గా ఆయన వ్యక్తిగతంగా ఒక పండుగకు సంబంధించిన విషయం కారణంగా ట్రెండ్ అవుతున్నారు.


సాధారణంగా ఏ పండుగ వచ్చినా స్టార్ సెలబ్రిటీలు తమ కుటుంబ సభ్యులతో లేదా తమకు దగ్గరైన వారితో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటారు. రెబెల్ స్టార్ ప్రభాస్‌కి కూడా అదే ఇష్టం. అయితే ఈసారి మాత్రం వినాయక చవితిని ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌తో కాకుండా ఒక మూవీ టీమ్‌తో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు తెలుగు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మనందరికీ తెలిసినట్టుగా ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్-ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఫౌజి" సినిమా షూట్‌లో చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్ నడుస్తోంది. అందుకే వినాయక చవితికి కూడా ఎటువంటి బ్రేక్ ఇవ్వకుండా మూవీ టీమ్‌తోనే పండుగ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారట.



అంతేకాదు, ఈసారి "ఫౌజి" మూవీ టీమ్ మొత్తం సినిమా షూటింగ్ సెట్లోనే వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. దానికోసం ప్రత్యేకంగా ప్రభాస్ ఇంటి దగ్గర నుంచి పిండి వంటలు తయారు చేయించి షూటింగ్ స్పాట్‌కి తెప్పించబోతున్నారని వార్త ఫిలిం సర్కిల్స్‌లో బాగా వైరల్ అవుతోంది. డార్లింగ్ ఎక్కడ ఉన్నా అక్కడ పండుగ వాతావరణం తప్పకుండా ఉంటుంది అని అభిమానులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా అదే నిజమవుతోంది. అందుకే ఈ వినాయక చవితి రెబల్ హీరో ప్రభాస్‌కి మరింత స్పెషల్ అని ఫ్యాన్స్ ఆనందంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: