"రెడ్డొచ్చె మొదలెట్టు" అనే సామెత మనం ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇది టచ్ అవుతుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి ఇది మరింత స్పష్టంగా ఎదుర్కొనే సమస్య. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతోంది. బాగా వైరల్ గా మారింది.  అలాగే ట్రోలింగ్ కి కూడా గురి అవుతుంది. మనందరికీ తెలుసు, మహేష్ బాబు ప్రస్తుతానికి రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో సినిమా సెట్స్ పై ఉంది..!


“గత అనుభవాల ప్రకారం రాజమౌళి సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేస్తారు” అని అనుకున్నారు జనాలు. కానీ రాజమౌళి మాత్రం అలాంటి పనిలో ఉండడం లేదు. ఈ సినిమా షూటింగ్‌ను ఆలస్యం అవుతుంది. కేవలం లుక్స్‌ కి ప్రాధాన్యం ఇచ్చి, దాదాపు 365 రోజులు టైం దీనికే కేటాయించారు. దీని బట్టి చెప్పేయొచ్చు రాజమౌళి ఈ సినిమాపై ఎంత ఆశలు పెట్టుకున్నారో అనేది. అదే విధంగా, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఓపికతో వెయిట్ చేస్తున్నారు. అయితే, రాజమౌళి చేస్తున్న ఓ “బిగ్ మిస్టేక్” సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా, “ఎప్పుడైనా సరే ఏ రోల్ కి ఎవరు సెట్ అవుతారు, సూట్ అవుతారు” అని పక్కాగా ఆలోచించి ముందుకు వెళ్ళే రాజమౌళి, ఈ విషయంలో తడబడినట్టే కనిపిస్తోంది.



దాంతో, ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా అనుకున్న ప్రియాంక చోప్రాను సెకండ్ లీడ్ గా మార్చారట. ఇప్పుడు, ఓ స్టార్ హీరోయిన్ సినిమా లో మెయిన్ లీడ్ గా తీసుకురావడం పై ఫోకస్ పెట్టిన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా–మహేష్ బాబు మధ్య తెరకెక్కించిన సీన్స్ పక్కన పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త హీరోయిన్ వస్తే, మళ్లీ ఆ సీన్స్ రీక్రియేట్ చేయాల్సి ఉంటుంది. జనాలు దీనిని టైం వెస్టు, డబ్బు వెస్టు అని అంటున్నారు. “రాజమౌళి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?” అనే విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూట్ ఆలస్యంగా జరుగుతుందని ఊహించిన సమయంలో, ఒక హీరోయిన్‌తో సీన్స్ పూర్తి కాకుండా మరొక హీరోయిన్ తీసుకురావడం, ఆ సీన్స్ మళ్లీ షూట్ చేయించుకోవడం ఎంతవరకు సరైనది అని విమర్శిస్తున్నారు. చిత్ర బృందం ఈ విషయంపై ఎటువంటి ఆఫీషియల్ ప్రకటన ఇవ్వకపోయినా, సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ కూడా చిత్ర బృందం ఎలా స్పందిస్తారు అనేది వెయిట్ చేస్తున్నారు.  “రాజమౌళి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తే బెటర్, లేకపోతే ఆయన ఇమేజ్ కు దెబ్బతగలవచ్చు" అంటూ సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: