కోలీవుడ్ ఇండస్ట్రీలో సుచిలిక్స్ అంటూ సింగర్ సుచిత్ర చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాలను సృష్టించాయో చెప్పాల్సిన పనిలేదు. ఇమే ఎంతోమంది స్టార్స్ పైన తీవ్రమైన ఆరోపణలు కూడా చేసింది. అందుకే ఈమె మాట్లాడిన మాటలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. అలాగే తన మాజీ భర్త కార్తీక్ కూడా గే అంటూ పలు రకాల షాకింగ్ కామెంట్స్ చేసింది. అందుకే ఆయనతో విడాకులు తీసుకున్నాను అంటూ ఒక బాంబ్ పేల్చింది సుచిత్ర. అయితే ఈ వివాదంలో హీరో ధనుష్ పేరు కూడా లాగింది. ఈ వ్యవహారం కోలీవుడ్ ఇండస్ట్రీలోని పెద్ద దుమారాన్ని రేపాయి.


తాజాగా ఇప్పుడు సింగర్ సుచిత్ర తన కాబోయే భర్త షణ్ముగరాజ్ తనను మోసం చేశారంటూ పలు రకాల ఆరోపణలు చేస్తోంది. తన ఇంటితో పాటు డబ్బులను కూడా లాక్కున్నారంటూ ఒక వీడియోని విడుదల చేసింది సుచిత్ర. కాబోయే భర్త షణ్ముగరాజ్ తో ఎంగేజ్మెంట్ అయ్యిందని ఆ తర్వాత అతని చేతిలో తీవ్రమైన గృహహింసకు లోనయ్యానంటూ సుచిత్ర ఆవేదనతో తెలియజేస్తోంది. వాడో పెద్ద చీటర్, మోసగాడు అంటు పోలీసులకు ఫిర్యాదు చేశానని సింగర్ సుచిత్ర.



గతంలో తాను చెన్నైలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి తనని వెళ్లగొట్టారని ఆ తర్వాత ముంబైకి వెళ్లి అక్కడ ఉద్యోగం చేసుకొని స్థిరపడిన సమయంలో సుచిలీక్స్ వివాదం  తర్వాత నా జీవితం చాలా దారుణంగా మారిపోయిందంటూ తెలిపింది. కానీ మళ్ళీ ఇప్పుడు నా లైఫ్ లో అలాంటిదే జరిగిందంటూ తెలిపింది సుచిత్ర. 48 ఏళ్ళ వయసులో ప్రేమలో పడ్డాను నా జీవితంలో ఎప్పుడు జరగకూడనివి చాలా జరిగాయి అంటూ బాధతో తెలియజేస్తోంది. ఇలాంటి వయసులో తాను ఎన్ని ఇబ్బందులను ఎన్ని హింసలను ఎదుర్కొంటానని అసలు ఊహించలేదని తెలిపింది.. తనని చాలా హీనంగా కొట్టేవాడని ,బూట్లతో తన్నేవాడని బాధలు భరించలేక  అలాగే ఏడుస్తూ ఉండేదాన్ని అంటూ తెలిపింది  సుచిత్ర. ఇదంతా కూడా తన మొదటి భార్య వల్లే చేస్తున్నారని తెలిపింది. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని చెప్పారు. ఈ విషయంలో తాను మోసపోయానని తెలిపింది సుచిత్ర. తనతో తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించే వరకు పోరాడుతూనే ఉంటానంటూ తెలిపింది సుచిత్ర.

మరింత సమాచారం తెలుసుకోండి: