
హీరోయిన్ల విషయానికి వస్తే… ఈ సినిమాతో మరో స్టార్ కిడ్ పరిచయం కాబోతోంది. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తెను కథానాయికగా తీసుకుంటున్నారని సమాచారం. నిజానికి రవీనా కుమార్తెను బాలయ్య తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకు హీరోయిన్‌గా తీసుకోవాలని అప్పట్లో ప్రయత్నించారు. ఫోటో షూట్ వరకు జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు అదే హీరోయిన్ జయకృష్ణతో ఎంట్రీ ఇవ్వబోతోందంటే గ్లామర్ డోస్ మరింత పెరిగినట్టే. ఇక మరో హైలైట్ విషయానికి వస్తే… ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం భారీ హంట్ జరిగింది. చివరికి ఆ రోల్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దగ్గర ఆగిందని సమాచారం. ఇప్పటికే చిత్రబృందం ఆయనతో చర్చలు జరిపిందని, మోహన్ బాబు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు అంగీకరించారని టాక్. నిజంగానే ఆయన విలన్‌గా వస్తే సినిమా హైప్ మూడింతలు పెరగడం ఖాయం.
సినిమా టైటిల్ విషయానికి వస్తే, 'శ్రీనివాస మంగాపురం' అనే పేరు పరిశీలనలో ఉంది. కథ మాత్రం ప్యూర్ లవ్ స్టోరీ అయినప్పటికీ… అందులో యాక్షన్, గ్రామ కక్షలు, కుటుంబ భావోద్వేగాలు అన్నీ ఉండబోతున్నాయి. క్లైమాక్స్ విషయంలో అయితే షాకింగ్ ట్విస్ట్ ఉంచారని, ఇది సినిమాకు మేజర్ హైలైట్ అవుతుందని సమాచారం.మొత్తానికి ఈ ఘట్టమనేని వారసుడి ఎంట్రీపై ఇప్పటికే టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జయకృష్ణ – రవీనా టాండన్ కుమార్తె – మోహన్ బాబు కాంబినేషన్… అజయ్ భూపతి డైరెక్షన్‌లో వస్తుందంటే ఈ లాంచ్ మూవీకి ఓ రేంజ్ హైప్ ఖాయం. అక్టోబర్ 15 నుంచి ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ కావడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు.