
ట్రైలర్ విషాయనికి వస్తే..
ఈ ప్రమాదం ప్రతి గ్రంధాన్ని చేరబోతోందనే డైలాగ్ తో మొదలవుతుంది.. తేజ సజ్జా ఎంట్రీ ఇచ్చిన తర్వాత..మంచు మనోజ్ ముఖాన్ని చూపిస్తారు. జగపతిబాబు తో పాటుగా, శ్రియ పాత్ర కూడా ఇందులో కీలకంగా ఉండనుంది.హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ తో పాటుగా మంచు మనోజ్ విలన్ గా అదరగొట్టేసారని ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. మంచు మనోజ్ కు కూడా ఇందులో ఏవో శక్తులు ఉన్నట్టుగా చూపించారు. అలాగే తొమ్మిది గ్రంధాలను దొరకకుండా కాపాడుతూ ఉంటే వాటిని అందుకోవాలని విలన్ (మంచు మనోజ్) ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మీరాయ్ అనే ఆయుధంతో హీరో ఎలా ఆపుతారు? అనే కథాంశంతో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. గ్రాఫిక్స్ కూడా హైలెట్ గా కనిపిస్తోంది. తేజ సజ్జా , గరుడ మధ్య వచ్చే సన్నివేశం కూడా హైలెట్గా కనిపిస్తోంది