రజినీకాంత్ తరచూ హిమాలయాలకు వెళ్తుంటారు అని చాలామందికి తెలుసు. ఆరోగ్యం కోసం అక్కడి స్వచ్ఛమైన గాలి కోసం వెళ్తుంటారని కొంతమంది అనుకుంటారు. కానీ మొట్టమొదటిసారి రజినీకాంత్ మాత్రం హిమాలయాలకు వెళ్ళింది ఆ హీరోయిన్ మరణం తర్వాత..ఆ హీరోయిన్ మరణించడంతో భయపడిపోయిన రజినీకాంత్ హిమాలయకు పారిపోయారట. మరి ఇంతకీ హీరోయిన్ మరణిస్తే రజినీకాంత్ ఎందుకు భయపడి హిమాలయాలకు పారిపోయారు. దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ 70 ఏళ్ల వయసు దాటినా కూడా ఇంకా తన యాక్టింగ్ తో అభిమానులు అలరిస్తున్నారు. రీసెంట్ గానే కూలీ మూవీతో వచ్చి ఓ మోస్తారు హిట్ కొట్టిన రజినీకాంత్ గురించి ఓ షాకింగ్ విషయం ఇప్పుడు తెలుసుకుందాం. 

రజినీకాంత్ సౌందర్య మరణించిన సమయంలో హిమాలయాలకు పారిపోయారట. ఇక అసలు విషయం ఏమిటంటే.. సౌందర్య విమాన ప్రమాదంలో మరణించిన సమయంలో ఎన్నో వార్తలు, ఊహగానాలు మీడియాలో వినిపించాయి. అందులో ఒకటే చంద్రముఖి సినిమా తర్వాత సౌందర్య మరణం..చంద్రముఖి సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత సౌందర్య మరణించింది. అయితే చాలామంది చంద్రముఖి సినిమాలో సౌందర్య ఎక్కడ ఉంది జ్యోతిక, నయనతారలు చేశారు కదా అనుకుంటారు. కానీ కన్నడ లో ఆప్తమిత్ర పేరుతో విడుదలైన సినిమాని తెలుగులో,తమిళంలో చంద్రముఖి పేరుతో విడుదల చేశారు.

 అలా 2004లో ఆప్తమిత్ర పేరుతో విడుదలైన ఈ సినిమాలో సౌందర్య చంద్రముఖి పాత్రలో నటించగా.. విష్ణువర్ధన్ రజినీకాంత్ పోషించిన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా విడుదలకి కొద్దిరోజులు ఉండగానే సౌందర్య మరణించింది.దాంతో చిత్ర యూనిట్ కి భయం పట్టుకుంది.కన్నడ నటుడు విష్ణువర్ధన్ ఆప్తమిత్ర మూవీకి సీక్వెల్ గా ఆప్త రక్షక్ అనే సినిమా చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి విడుదలకు కొద్ది రోజులు ఉండగానే విష్ణువర్ధన్ కూడా మరణించారు  దాంతో మొదటి పార్ట్ తీసిన సమయంలో సౌందర్య మరణం ఆ తర్వాత దానికి సీక్వెల్ గా వచ్చిన సినిమా రిలీజ్ కి ముందు విష్ణువర్ధన్ మరణంతో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడింది.

ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో రజినీకాంత్ దాకా వచ్చింది. ఇక అప్పటికే రజినీకాంత్ కూడా చంద్రముఖి సినిమాలో నటించారు. ఇదేంటి చంద్రముఖి సినిమాలో చేసిన వీళ్ళిద్దరూ చనిపోయారు.. వీళ్ళ మరణానికి కారణం చంద్రముఖి దయ్యమే అంటూ ప్రచారం జరిగింది. ఇక ఈ ప్రచారం సినిమాకి పబ్లిసిటీని తెచ్చి పెట్టినప్పటికీ ఈ విషయం విన్న చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు భయపడిపోయారు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మరణాన్ని చూసి భయపడిపోయిన రజినీకాంత్ హిమాలయాలకు పారిపోయారట. హిమాలయాలకు వెళ్లి పూజలు చేయడంతో పాటు మైసూర్ లోని తన ఇంట్లో కూడా హోమం చేయించారని పలు రూమర్లు ఆ మధ్యకాలంలో వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: