మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన తాజా మూవీ మీరాయ్.. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న తాజా మూవీ  మిరాయ్. ఈ సినిమాలో మనోజ్ తేజ సజ్జా కి విలన్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో జగపతిబాబు, శ్రియా శరన్ వంటి వాళ్ళు కీలకపాత్రల్లో నటించగా రితిక నాయక్ హీరోయిన్ గా చేస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్,పోస్టర్, పాటలు అన్నీ కూడా అభిమానులని ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా హనుమాన్ మూవీ లెవెల్ లో ఉందని చాలామంది సెలబ్రిటీలతో పాటు సినీ విశ్లేషకులు కూడా మెచ్చుకున్నారు.

అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మంచు మనోజ్ ఇండస్ట్రీలో కొంతమందిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన కొన్ని మాటలు వైరల్ గా మారాయి. ఈ ఈవెంట్లో మంచు మనోజ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కొన్ని తిమింగలాలు ఉన్నాయి. కానీ ఆ తిమింగలాలను తట్టుకొని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిలబడ్డారు . సినిమా ఇండస్ట్రీలో ఉండే తిమింగలాలకు ఎదురు తిరుగుతూ మీరు ఈ సినిమా కోసం నిలబడ్డారు.మీలాంటి గుండె వంద సంవత్సరాలు బతకాలి సార్.ఓవైపు సినిమాలు చేస్తూనే సీరియల్స్ కూడా చేస్తున్నారు.

నిజంగా మీరు గ్రేట్ సార్.. తేజ మీద..నా మీద..డైరెక్టర్ కార్తీక్ మీద.. ఉన్న నమ్మకంతో ఎన్ని అవరోధాలు, అడ్డంకులు వచ్చినా కూడా ముందుండి నడిపించారు అంటూ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ని పొగుడుతూ మాట్లాడారు.అయితే అంతా బాగానే ఉంది కానీ మంచు మనోజ్ మాట్లాడిన ఆ తిమింగలాలు ఎవరు.. ఈ సినిమాని అడ్డుకున్నది ఎవరు అంటూ చాలామంది జనాలు మంచు మనోజ్ మాట్లాడిన మాటల్ని వైరల్ చేస్తూ మనోజ్ దృష్టిలో ఉన్న ఇండస్ట్రీలోని తిమింగలాలు ఎవరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మంచు మనోజ్ టార్గెట్ చేసి మాట్లాడిన ఆ తిమింగలం ఎవరో బయటపడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: