
కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల అల్లు-మెగా కుటుంబాల మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ఫ్యామిలీ సభ్యులు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఘర్షణలకు దిగారు. కాగా అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నం గారు నిన్న మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెగా-అల్లు కుటుంబ సభ్యులు ఒకచోట చేరి ఆ కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. కష్టకాలంలో మన వెంట ఉండేవారే మన నిజమైన బంధువులు అని అందరికీ నిరూపించారు. మెగా ఫ్యామిలీ అన్ని విధాలా అల్లు కుటుంబానికి అండగా నిలిచింది. అల్లు అర్జున్ కూడా మెగా కుటుంబాన్ని ఆత్మీయంగా స్వాగతించాడు.
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్, సాయి ధరమ్ తేజ్ అందరూ కలిసి ఒకే వేదికపై నిలబడి కార్యక్రమాలను పూర్తి చేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ హగ్ చేసుకోవడం, కలిసి తిరగడం, పనులను కలిసి షేర్ చేసుకోవడం పెద్ద హైలైట్‌గా మారింది. ఇది చూసి సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా వీరి గురించి చర్చ జరుగుతోంది. వీరిద్దరూ కలిసిపోవడం సినిమా ఇండస్ట్రీకి కోట్ల లాభాలను తీసుకువస్తుందని అందరూ అంటున్నారు. ఎందుకంటే, వీరు దూరంగా ఉంటే ఫ్యాన్స్ కూడా గొడవలో పడి, ఒక హీరో సినిమా రిలీజ్ అయ్యే సమయంలో మరొక హీరో సినిమాకు నష్టం కలిగించే పరిస్థితులు వచ్చేవి. త్వరలోనే పెద్ద సినిమాలు రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ, అలాగే ఇతర భారీ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ అల్లు-మెగా కుటుంబ ఐక్యతతో ఫ్యాన్స్ కూడా కలిసికట్టుగా సినిమాలను బ్లాక్‌బస్టర్ హిట్ చేస్తారని, మేకర్స్‌కి లాభాల వర్షం కురిపిస్తారని టాక్ నడుస్తోంది. "అల్లు-మెగా పవర్" అంటే ఇదే అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.