టాలీవుడ్ లో ఈరోజు ప్రముఖ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స చేసిన ఒక పని సంచలనంగా మారింది.ముఖ్యంగా తాను తెరకెక్కించిన  చిత్రం బార్బరిక్. ఈ చిత్రం ఇటీవలే విడుదలై డిజాస్టర్ టాక్ ను కూడా సొంతం చేసుకుంది. బార్బరిక్ సినిమా ఆడుతున్న  థియేటర్లోకి వెళ్లి డైరెక్టర్ మోహన్ శ్రీవత్స అందులో కేవలం పది మంది మాత్రమే ప్రేక్షకులు ఉన్నప్పటికీ వారిని సినిమా ఎలా ఉందని అడగగా? బాగున్నదని చెప్పారు. అయినా కూడా ప్రేక్షకులు సినిమా చూడడానికి రాకపోవడంతో ఈ సినిమా కోసం తాను రెండేళ్లు కష్టపడ్డానని తాను ఆత్మహత్య చేసుకుంటానేమో అని తన భార్య చాలా భయపడుతోందని కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాకుండా తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఈ విషయం టాలీవుడ్ లోనే సంచలనంగా మారింది. డైరెక్టర్ చేసిన పనికి చాలామంది విభిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.


ఈ విషయంపై తాజాగా లిటిల్ హాట్ ప్రమోషన్స్ లో పాల్గొన్న బన్నీ వాసు ఈ అంశం పైన స్పందించారు.. ఎప్పుడూ కూడా ప్రేక్షకులు రావడం లేదని చెప్పే దానికంటే ఎందుకు రావడం లేదనే విషయాన్ని ఆలోచించాలి వాళ్ళు రావడం రాకపోవడం వాళ్లే ఇష్టమే.. వాళ్లని థియేటర్లోకి రప్పించేలా మనం కష్టపడాలి.. ఎందుకంటే ఎక్కడో మనకి వాళ్ళకి ఒక గ్యాప్ అనేది పెరిగింది. ఆ గ్యాప్ ని క్లియర్ చేసుకొని ముందుకు వెళ్లాలి తప్ప థియేటర్లోకి జనాలు రావడం లేదు అనేది కరెక్ట్ కాదనేది తన అభిప్రాయం అంటూ వెల్లడించారు.


ఇలాంటి విషయాలను ప్రేక్షకుల మీద బ్లేమ్ చేయడం సరైనది కాదు అంటూ వెల్లడించారు బన్నీ వాసు. వాళ్లకి నచ్చితే సినిమాకి వస్తారు లేకపోతే లేదు.. కానీ ప్రేక్షకులకు మనకి ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలుసుకోవాలి దాన్ని సెట్ చేసుకోవాలి తప్పితే ఇలా బాధపడడం సరైనది కాదు అంటూ తెలియజేశారు బన్నీ వాసు. ప్రస్తుతం బన్నీ వాసు చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: