
సమంత:
ఇండస్ట్రీలో చాలా మంది విడాకులు తీసుకున్నా, సమంత-నాగ చైతన్య విడాకులు మాత్రం టాలీవుడ్ మాత్రమే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్‌లను కూడా షేక్ చేశాయి. “సమంత ది తప్పా? నాగచైతన్య ది తప్పా?” అంటూ రకరకాల చర్చలు జరిగాయి. విడాకుల తర్వాత కూడా సమంత జీవితంలో ఎలాంటి వెనుకడుగు పడలేదు. తన ప్రతిభను మరింతగా ప్రదర్శించి, సూపర్ సక్సెస్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించింది. సోషల్ మీడియాలో కూడా సమంతకు విపరీతమైన ప్రశంసలు లభించాయి.
నిహారిక:
మెగా ఫ్యామిలీ కూతురు నిహారిక విడాకులు తీసుకున్న వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. మెగా ఫ్యామిలీ అంటేనే ట్రోల్ చేయడానికి రెడీగా ఉండే ఒక బ్యాచ్, మరీ ఈ వార్త వారికి మంచి అవకాశం ఇచ్చింది. అయితే నిహారికకు కుటుంబం పూర్తిగా అండగా నిలిచింది. విడాకుల తర్వాత నిహారిక వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ముందుకు దూసుకుపోయింది. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి తనదైన స్టైల్‌లో సినిమాలు నిర్మిస్తోంది. నిహారిక ఇప్పుడు కేవలం “విడాకులు తీసుకున్న అమ్మాయి” కాదు, అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది.
ధనుష్:
రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో ధనుష్ విడాకులు తీసుకున్నప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. “ఇంత పెద్ద స్టార్ అవ్వడానికి కారణం రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్. క్రేజ్ పెంచుకున్నాక ఆయన కూతురిని వదిలేస్తావా?” అంటూ విమర్శలు వచ్చాయి. కొంతమంది ధనుష్‌కు ఎఫైర్ ఉందని రూమర్స్ కూడా పుట్టించేశారు. కానీ ఇవన్నీ అబద్ధమని తర్వాత తేలింది. భార్యాభర్తలుగా విడిపోయినా, తల్లిదండ్రులుగా పిల్లల కోసం ఇద్దరూ సమానంగా కృషి చేస్తున్నారు. విడాకుల తర్వాత ధనుష్ కెరీర్‌లో మాత్రం ఎలాంటి వెనుకడుగు పడలేదు. ఆయన నటించిన సినిమాలు వరుస విజయాలు సాధించాయి. ఇలా ఈ స్టార్స్ ఉదాహరణగా చూపుతూ, విడాకులు తీసుకున్నా జీవితంలో ఏదో కోల్పోయామన్న భావన అవసరం లేదని, కష్టపడి ప్రయత్నిస్తే విడాకుల తర్వాత కూడా సూపర్ సక్సెస్ అవ్వచ్చని వాళ్ల ఫ్యాన్స్ చెబుతున్నారు.