
ఈ విషయంపై పూర్తి సమాచారం అందుకున్న థానే పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారమే వ్యవహరించి ఇద్దరు డికాయిడ్ కస్టమర్లను రంగంలోకి పంపించారు. వారు అనుష్కను సంప్రదించి ఆమెతో ఒప్పందం కుదుర్చుకొని పక్క ఆధారాలను సేకరించి మరి.. ఆమె డబ్బులు తీసుకుంటున్న ప్రాంతంలో దాడి చేసి అనుష్కను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసుల దాడిలో వ్యభిచార దందాలో చిక్కుకున్న కొంతమంది మహిళలను, మరి కొంతమంది మహిళా నటులను కూడా రక్షించినట్లు పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు.
అయితే ఇందులో టీవీ సీరియల్స్ లలో నటించే వారే కాకుండా, కొంతమంది బెంగాల్ చిత్రాలలో నటించే వారు ఉన్నారని మహారాష్ట్ర పోలీస్ కమిషనర్ మదన్ బాల్లాల్ తెలియజేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా మహారాష్ట్ర సినీ పరిశ్రమ ఉలిక్కిపాటికి గురైంది. నటి అనుష్క మోని మోహన్ దాస్ పైన కేస్ ఫైల్ చేసి మరి విచారిస్తున్నట్లు తెలిసింది. మరి ఈ నటి వెనక ఎవరెవరు ఉన్నారనే విషయంపై అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.ఇలాంటివి ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతున్నాయని.. ఇలాంటి మోసాల బారిన పడకుండా మహిళలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. మరి నటి అనుష్క వ్యవహారం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.