టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొంత కాలం క్రితం భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. తాజాగా ఈయన కిష్కిందపురి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ కాంబోలో రాక్షసుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరియర్లోనే మంచి విజయం సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచిపోయింది.

అలా వీరి కాంబోలో రూపొందిన రాక్షసుడు సినిమా మంచి విజయం సాధించి ఉండడంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడమ విడుదల ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అలాగే మంచి కలెక్షన్లు కూడా ఈ సినిమాకు ప్రస్తుతం దక్కుతున్నాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాకు కూడా అత్యంత దగ్గరగా వచ్చేసింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ వారం రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.23 కోట్ల షేర్ ... 14.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

వారం రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 9.83 కోట్ల షేర్ ... 18.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల బ్రేక్ ఈవెన్ ఫార్ములా తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాకు అత్యంత దగ్గరగా వచ్చేసింది. ఈ సినిమా హిట్ స్టేటస్ను అందుకోవడం పక్కాగా కనబడుతుంది. రాక్షసుడు సినిమా తర్వాత బెల్లంకొండ , అనుపమ కాంబో లో వచ్చిన కిష్కిందపురి సినిమా కూడా హిట్ స్టేటస్ను అందుకోవడం పక్క అని దాదాపుగా డిసైడ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bss