గత 36 గంటల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది సాయి పల్లవి పేరు మాత్రమే. ఒక పక్క "ఒజీ" సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ, ఆ వార్తలను బీట్ చేసే రేంజ్‌లో సాయి పల్లవికి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది.సాయి పల్లవి బికినీ వేసుకున్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. “నిజంగానే సాయి పల్లవి బికినీ వేసుకున్నారా?”, “సాయి పల్లవి బికినీ ఎందుకు వేసుకుంది?” అని కొంతమంది.. “సాయి పల్లవి మహా ముద్దుగుమ్మ, ఆమె కూడా కన్నింగ్ లేడీ?” అని మరికొంతమంది  సోషల్ మీడియాలో విపరీతంగా చర్చించుకుంటున్నారు.


కొంతమంది నటీమణులు తమ గ్లామర్ ద్వారా అభిమానులను ఆకర్షిస్తే, మరి కొంతమంది నటన నైపుణ్యంతో ప్రేక్షకులను మెప్పిస్తారు. ఆ లిస్టులోనే వస్తుంది అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఇప్పటివరకు ఆమెకు సంబంధించి ఒక్కటంటే ఒక్క వల్గర్ ఫొటో కూడా ఒరిజినల్‌గా బయటకు రాలేదు.కానీ, రీసెంట్‌గా బికినీ ఫొటోలు వైరల్ అయ్యాయి. సాయి పల్ల్వి చెల్లి పూజా ఇంస్టాగ్రామ్ ఖాతాను పరిశీలించినవారు, కొన్ని ఫొటోలు చూసి సాయి పల్లవిపై మండిపడ్డారు. “సినిమాల్లో రూల్స్ అంటూ బికినీ వేసుకోదు.. ఈ ముద్దుగుమ్మ ఎందుకు ఇప్పుడు బికినీ వేసుకుంది?” అని కొందరు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రామాయణం వంటి భక్తి ప్రాజెక్ట్‌లో నటిస్తున్న బ్యూటీ ఇలా బికినీ ఎందుకు వేసుకుంది..? అని బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చర్చ మొదలైంది.



కానీ, ఇది మొత్తం ఫేక్‌. అసలు ఇవి సాయి పల్లవి ఒరిజినల్ ఫొటోలు కాదని, ఎవరో ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలను మార్ఫ్  చేసి విడుదల చేశారనే న్యూస్ బయటకు వచ్చింది. సాయి పల్లవి సోదరి ఇంస్టాగ్రామ్ ఖాతాను పరిశీలిస్తే, వైరల్ ఫోటోలు నకిలీగా స్పష్టంగా అర్థమవుతుంది. బ్యాడ్ లక్ ఏంటంటే, నిజాలు తెలియకుండానే సాయి పల్లవిని టార్గెట్ చేస్తారు. దీని పట్ల సినీ ప్రముఖులు కూడా ఆమెకు సపోర్ట్ ప్రకటించారు. ఇలాంటి ఫోటో మార్పింగ్ పద్ధతిని ఆపాలని ఘాటుగా రియాక్ట్ చేస్తున్నారు.కొంతమంది సాయి పల్లవి ఫొటోలను మార్ప్ చేసి షేర్ చేసిన వారిని ఘాటుగా బూతులు తిడుతున్నారు. “సిగ్గు లేదా కడపకు తినేది అన్నమాటేనా? ఒక ఆడపిల్లకు సంబంధించి ఇలాంటి ఫోటోలు బయట పెడతారా?” అని సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ కౌంటర్స్ వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: