ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ఫీవర్ ఎక్కువగా కనిపిస్తోంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా వస్తున్న చిత్రాన్ని డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హస్మి, శ్రియా రెడ్డి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ తదితర నటీనటులు నటిస్తున్నారు. ఇందులో స్పెషల్ సాంగ్ లో కూడా ప్రముఖ హీరోయిన్ నేహా శెట్టి సందడి చేయనుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓజి సినిమా నటీనటుల రెమ్యూనరేషన్ వైరల్ గా మారుతోంది.


ఓజి సినిమాకి పవన్ కళ్యాణ్ ఏకంగా రూ .80 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ సుజిత్ కూడా రూ .8 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు టాక్,అలాగే హీరోయిన్గా నటించిన ప్రియాంక మోహన్ రూ. 2 కోట్లు, విలన్ పాత్రలో కనిపించిన ఇమ్రాన్ హస్మి  రూ .5 కోట్లు, ప్రకాష్ రాజ్ రూ.1.5 కోట్లు, అర్జున్ దాస్ రూ.40 లక్షలు, శ్రియా రెడ్డి 50 లక్షలు. సంగీత దర్శకుడు థమన్ రూ.5 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వినిపిస్తున్నాయి. మిగిలిన నటీనటులకు, టెక్నీషియన్స్ కు కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద చూసుకుంటే రూ .250 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.



ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రూ .50 కోట్ల రూపాయల వరకు ఓజీ సినిమా గ్రాస్ కలెక్షన్స్ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో చూడాలి మరి. నిన్నటి రోజున విడుదలైన ట్రైలర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించడంతో సినిమా పైన అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. ఈ ఏడాది విడుదలైన హరిహర వీరమల్లు సినిమా ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. మరి ఓజి సినిమాతో అభిమానులను ఆకట్టుకుంటారెమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: