మన సినీ ఇండస్ట్రీలో తమకి ఇష్టమైన హీరో మూవీ రిలీజ్ అయింది అంటే హీరో అన్న గుర్తింపును వదిలేసి థియేటర్లకి వెళ్లి హంగామా చేసే హీరోలు చాలామందే ఉన్నారు . తమ ఫ్యామిలీ పరంగా అయినా లేదా ఇతర కారణాల చేత ఒక సినీ హీరో మరో హీరోకి అభిమాని కావచ్చు . ఇలా అయిన వారు తమ హీరో నిజాన్ని పక్కన పెట్టి తమ అభిమాన హీరో సినిమాని చూసేందుకు సాధారణ ప్రేక్షకుడు లాగా ధియేటర్లకి విచ్చేస్తూ ఉంటున్నారు . ఈ క్రమంలోనే సాయి ధరంతేజ్ కూడా నడిచాడు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఓజి మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే .


ఒకపక్క పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో పక్క సినీ రంగంలో కూడా దూసుకుపోతున్నాడు . డిప్యూటీ సీఎం గా తనదైన సత్తా చాటుతూ ప్రజెంట్ సినీ రంగంలో మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ చిందులు వేస్తున్నాడు . ఇక తాజాగా రిలీజ్ అయిన ఓజీ మూవీ  కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు . టికెట్టు వెయ్యి రూపాయలు ఉన్నప్పటికీ తమ అభిమానులు ఎక్కడ తగ్గకుండా కొనుగోలు చేస్తున్నారు . ఇక ఇదిలా ఉంటే తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరంతేజ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . సాయి ధరం తేజ్ కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే .


మామ, అల్లుడు అయినటువంటి వీరిద్దరూ పలు షోలలో కలిసి కనిపిస్తూ ఉంటారు . ఇక చాయి దారం తేజ్ కూడా పలు ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ కామెంట్స్ చేస్తూ ఉంటాడు . ఇక ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన ఓజీ మూవీ చూసేందుకు  సాయి ధరంతేజ్ థియేటర్ కి వెళ్లి తనదైన రీతిలో రచ్చ చేశాడు . ఈలలు కేకలతో మరియు పేపర్లను ఎగరేస్తూ కేరింతలు కొట్టాడు . ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు . ఇక సాయి ధరం తేజ్ ఒక్కడే కాకుండా.. వరుణ్ తేజ్ మరియు డైరెక్టర్ శంకర్ కూడా థియేటర్లలో తమదైన రీతిలో హడావిడి చేశారు . ప్రజెంట్ ఎందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: