
టీజర్ విషయానికి వస్తే.. మీనాక్షి చౌదరి ఎంట్రీ తోనే జువెలరీ యాడ్ చెప్పినట్లుగా డైలాగ్ తో చూపించారు. ఆమె అలా చెబుతూ ఉన్న సమయంలో నవీన్ పోలిశెట్టి వచ్చి కట్ కట్..ఇది జువెలరీ యాడ్ కాదు..మన సినిమా అనగనగా ఒక రోజు సినిమా ప్రోమో వీడియో అని చెప్పగా .. సరే రెడీ అంటూ మీనాక్షి చౌదరి చెప్పిన చివరికి అనగనగా ఒక రాజు అంటూ మళ్లీ మీనాక్షి జువెలరీ యాడ్ గురించి చెబుతుంది.. మళ్లీ కట్ కట్ అంటూ వచ్చిన నవీన్ పోలిశెట్టి.. జువెలరీ యాడ్ కాదు మన సినిమా గురించి మాట్లాడు అంటూ చెప్పగా.. నేను హీరోయిన్ ని బంగారం చూస్తే జ్యువెలరీ యాడ్ మూడులోకి వెళ్లిపోతానని చెప్పగా.. వెటనే అర్థమయ్యింది అంటు ..నవీన్ పోలిశెట్టి ఒంటిమిదికి మీనాక్షి చౌదరి ఒంటి మీద ఉండే బంగారం వచ్చేలా చూపించారు..
ఆ తర్వాత అనగనక ఒక రాజు సినిమా జనవరి 14 సంక్రాంతికి విడుదల అవుతుంది అంటూ మొదలుపెడుతుంది మీనాక్షి చౌదరి. ఆ వెంటనే కొన్ని సినిమాలోని ఫన్నీ సీన్స్ చూపించి ఓరేంజ్ లో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్లు చూపించారు. ఇందుకు సంబంధించి టీజర్ ప్రోమో వైరల్ గా మారడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ టీజర్ ప్రోమోతో మీనాక్షి చౌదరి కి మళ్ళీ సంక్రాంతి బాగా కలిసి వచ్చేలా ఉన్నది. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటన్నిటిని మించి అనగనగా ఒక రాజు సినిమాకు ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి.