
రష్మిక వ్యక్తిగతంగా చూస్తే ఆమె జీవితం అసలు ఒక ప్రేరణాత్మక ప్రయాణం అని చెప్పాలి. లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన ఆమె, కష్టపడితే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది. చిన్నప్పట్లో బొమ్మ కొనడానికి కూడా తల్లిదండ్రులు ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి. అద్దె ఇళ్లలో మారుతూ జీవితం సాగించిన రష్మిక, తన పట్టుదలతో, కష్టంతో, ప్రతిభతో కోట్ల మంది అభిమానులను సంపాదించి ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదించే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.‘చలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘పుష్ప’ వంటి సినిమాల ద్వారా ఆమె టాలీవుడ్‌లో తన స్థాయిని పటిష్టం చేసుకుంది. ఒక్క తెలుగు కాకుండా, కన్నడ, తమిళ, హిందీ చిత్రాల్లో కూడా రష్మికకు భారీ డిమాండ్ ఉంది. హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ చూసినా టాప్ పొజిషన్‌లోనే కనిపిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే, ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ హీరో, తన స్టైల్, డేరింగ్ అటిట్యూడ్‌తో యువతకు ఐకాన్‌గా మారిపోయాడు. రష్మికతో అతడి కెమిస్ట్రీ రియల్ లైఫ్‌లో కూడా కొనసాగుతుందా అన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇండస్ట్రీలో వీరిద్దరి నిశ్చితార్థం వార్తలపై ఇంకా అధికారిక ధృవీకరణ రాకపోయినా, అభిమానులు మాత్రం ఇప్పటికే ఆనందంలో మునిగిపోయారు. “రష్మిక-విజయ్ ఎప్పటికీ ఇలా హ్యాపీగా ఉండాలి”, “మన గీత గోవిందం జంట రియల్ లైఫ్‌లో కూడా యూనైటయ్యింది” అంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. రష్మిక మందన్నా ఇప్పుడు ఉన్న స్థానం ఆమె కష్టం, పట్టుదల ఫలితం. తన కెరీర్‌లో ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకుంటూ, ఒక మంచి నటిగా మాత్రమే కాకుండా ఒక ప్రేరణాత్మక మహిళగా ఎదిగింది. ఇప్పుడు అభిమానులు ఎదురు చూస్తున్న ఒక్కటే విషయం — రష్మిక, విజయ్ ప్రేమకథ ఎప్పుడు అధికారికంగా బయటకు వస్తుందో అనేది..??? చూడాలి మరి ఏం జరుగుతుందో..??