నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో వ‌రుసగా సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో దూసుకు పోతున్నారు. ఇటీవల వ‌రుస‌గా అఖండ‌, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, అలాగే రాబోయే డాకు మహారాజ్ సినిమాల‌తో వరుస విజయాలు అందుకుని మాస్‌ ఆడియెన్స్‌ను మళ్లీ తనవైపు తిప్పుకున్నారు. ఇప్పుడు ఆయన బోయపాటి శ్రీనుతో కలిసి రూపొందిస్తున్న అఖండ 2 తర్వాత మరో భారీ ప్రాజెక్ట్‌ కోసం సిద్ధమవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే NBK111 సినిమా. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయ్యిందని సమాచారం. కథలో సెకండ్ హాఫ్‌లో బాలయ్య పాత్రకు సంబంధించి ఓ పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్‌ సీక్వెన్స్ ఉంటుందట‌. ఇది మాఫియా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఇది సినిమాలో మెయిన్ హైలైట్‌గా నిలవనుందట.


గోపీచంద్ మలినేని శైలిలో మాస్‌, ఎమోషన్‌, యాక్షన్‌ మిళితంగా ఉండేలా ఈ కథను రాసినట్లు చెబుతున్నారు. సినిమాను వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీశ్‌ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. బాలయ్య రేంజ్ లో  గ్రాండ్‌ మేకింగ్‌, హై వాల్యూమ్‌ యాక్షన్‌ సన్నివేశాలు, భావోద్వేగాలకు చోటు కల్పిస్తూ ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇటీవల సోషల్ మీడియా వేదికగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ “ గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్ .. ఈసారి మా గర్జన మరింత బలంగా వినిపించబోతోంది. బాలకృష్ణ గారితో మరోసారి వర్క్ చేయడం నాకు గర్వకారణం. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందంటూ ఉత్సాహంగా తెలిపారు. ఫైన‌ల్ గా బాలయ్య 111వ ప్రాజెక్ట్‌ పై అభిమానుల్లో హై ఎక్సైట్మెంట్‌ నెలకొంది. గోపీచంద్ మలినేని - బాల‌య్య కాంబినేషన్‌లో మరో మాస్ బ్లాక్‌బస్టర్‌ రాబోతుందనే అంచనాలు ముమ్మరంగా ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: