సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం..ఇక్కడ లేనిది ఉన్నట్లు..ఉన్నది లేనట్లు చూపిస్తుంటారు. స్టార్ గా వెలిగిపోయిన వారు..దీన స్థితిలో ఉంటారు..చిన్న స్థాయిలో ఉన్నవారు కోటీశ్వరులుగా మారుతారు.  పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కంచి ఆలయంలో భిక్షాటన చేస్తూ.. దుర్భర పరిస్థితుల్లో జీవిస్తుండటం సినీ పరిశ్రమను కలిచివేస్తోంది. బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవ్వడం అనేది సినిమా పరిశ్రమలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా నిర్మాతల విషయంలో ఇది జరుగుతుంది. ఒక్క సినిమా హిట్ అయితే నిర్మాత స్థాయి అమాంతం పెరుగుతుంది. అదే సినిమా ఫ్లాప్ అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నిర్మాతలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.

Image result for దర్శకుడు సెంథిల్ నాథన్

తాజాగా తమిళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సెంథిల్ నాథన్ సినిమాల్లో ఆఫర్ లేక పోవడంతో కలత చెంది కంచి దేవాలయం వద్ద బిక్షాటనం చేస్తూ ఉన్నాడు.   దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖరన్‌ వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించిన సెంథిల్‌ నాథన్‌.. ఆ తరువాత విజయకాంత్‌ నటించిన ‘పూందోట్ట కావల్‌క్కాన్‌’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒకప్పుడు ఎంజీఆర్ సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జంబులింగం తనయుడు సెంథిల్ నాథన్.. తండ్రి నడిచిన బాటలోనే సినీ ఇండస్ట్రీకి వచ్చాడు.

director senthilnathan shocks flim industry - Sakshi

అసిస్టెంట్ గా కొన్నాళ్ళు పనిచేసి దర్శకుడిగా మారారు. తమిళంలో దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన స్వీయ దర్శకత్వంలో 2009లో ‘ఉన్నై నాన్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆయన ఎన్నో ఆర్థిక సమస్యలు, కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. దీంతో ఈ చిత్రం విడుదల కాలేదు. ఆ తరువాత సెంథిల్‌నాథన్‌ బుల్లితెరపై దృష్టి సారించినా.. అక్కడ విజయం సాధించలేకపోయారు.  ఆ తరువాత సెంథిల్‌నాథన్‌ బుల్లితెరపై దృష్టి సారించినా.. అక్కడ విజయం సాధించలేకపోయారు. 


స్వీయ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సీరియల్‌ నుంచి ఆయనను ఇటీవల తొలగించారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన సెంథిల్‌నాథన్‌.. ఇంటిని వదిలి కంచికి వెళ్లిపోయారు.  అక్కడి ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు.  ఈ విషయం తెలిసిన అతని కుటుంబసభ్యులు, సినీపరిశ్రమకు చెందిన కొందరు అక్కడికి వెళ్లి రమ్మని కోరగా రానని చెప్పారట. దీంతో కుటుంబసభ్యుల పోలీసుల సహాయంతో సెంథిల్ నాథన్ ను చెన్నైకు తీసుకొచ్చి.. ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: