టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమెడియన్ కం హీరో గా సునీల్ కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో సునీల్ చేసే కామెడీని ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు, తరువాత సునీల్ హీరోగా వేసిన పాత్రలను కూడ అంతే ఎంజాయ్ చేశారు. అయితే ప్రేక్షకులు ఎంత ఆధరించినప్పటికీ, సునీల్ హీరోగా చేసిన మూవీలు మాత్రం బాక్సాపీస్ వద్ద అంత సక్సెస్ ఫుల్ గా కలెక్షన్స్ ని కురిపించడం లేదు. సునీల్ హీరోగా నటించిన మూవీలకి బాక్సాపీస్ వద్ద ఒక లిమిట్ అంటూ ఉంది. సునీల్ హీరోగా వచ్చిన మూవీలు ఓ బడ్జెట్ ప్రకారం ముందుకు వెళితే, అది కచ్చితంగా నిర్మాతలకి లాభాలని తెచ్చిపెడుతుంది. కాని బడ్జెట్ మితిమీరడంతో, రిలీజ్ అనంతరం నిర్మాతలకి నష్టాలు రావడం, హీరోకి ఫేం పోవడం వంటివి జరుగుతున్నాయి. దీంతో సునీల్ తో మూవీలు అంటే నిర్మాతలు భయపడుతున్నారు. ప్రస్తుతం సునీల్ ఏ మూవీలో నటించక కాళీగానే కాలక్షేపం చేస్తున్నాడు. అయితే సునీల్ కామెడీ అంటే ఇప్పటి ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి, చాలా మంది దర్శకులు సునీల్ కి ఫోన్ చేసి కమెడిన్ రోల్ వేస్తావా? అంటూ ఆఫర్స్ ఇస్తున్నారంట. కాని సునీల్ మాత్రం కామెడీ పాత్రలపై ఇప్పట్లో చూడకుడదని నిర్ణయించుకున్నాడు. కాని తనకు వచ్చే ఆఫర్స్ మత్రం తగ్గటం లేదు. దీంతో దర్శకుల తీరుపై సునీల్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుందని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. సునీల్ త్వరలో ఏదొక నిర్ణయం తీసుకోకపోతే తన ఫిల్మ్ కెరీర్ కే నష్టం వాటిల్లొచ్చని ప్రముఖులు సలహాలు కూడ ఇస్తున్నారంట. 

మరింత సమాచారం తెలుసుకోండి: