ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకులు చాలామంది ఉన్నారు..అటు వైసీపీలో గాని, ఇటు టీడీపీలో గాని ఫైర్ బ్రాండ్ నాయకులకు కొదవ లేదు....రెండు వైపులా మంచి నాయకులే ఉన్నారు..ఇక ఫైర్ బ్రాండ్ల పని ఏంటో చెప్పాల్సిన పని లేదు...ప్రత్యర్ధులపై విరుచుకుపడటమే ఫైర్ బ్రాండ్ల పని..అలాగే తమ తమ స్థానాల్లో దూకుడుగా రాజకీయం చేస్తారు. అలా టీడీపీ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నాయకులు బాగా దూకుడుగా రాజకీయం చేస్తూ ఉంటారు...అది కూడా ఇద్దరు నేతలు కమ్మ వర్గానికి చెందిన వారే...ఇక వారు ఏది అనుకుంటే అది జరిగేలా చేసుకుంటారు.

అలాంటి ఫైర్ బ్రాండ్ నాయకులు ఈ సారి ఎలాగైనా గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు..ఈ సారి గెలిచి వైసీపీకి చుక్కలు చూపించాలని బాగా ఆరాటపడుతున్నారు. అలా ఆరాటపడుతున్న కమ్మ నేతలు ఎవరో కాదు...ఒకరు చింతమనేని ప్రభాకర్, మరొకరు యరపతినేని శ్రీనివాసరావు...ఇద్దరు నేతలు మంచి రెబల్ నాయకులు...తాము అనుకున్నది సాధించడంలో ఎప్పుడు ముందే ఉంటారు. అలాగే టీడీపీ అధికారంలో ఉండగా వీరు దూకుడుగా వెళ్ళి ఎన్ని చిక్కుల్లో పడ్డారో తెలిసిందే.

అయితే గత ఎన్నికల్లో ఇద్దరు నేతలు అనూహ్యంగా జగన్ గాలిలో ఓడిపోయారు...ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక వీరిపై ఎన్ని కేసులు నమోదయ్యాయో చెప్పాల్సిన పని లేదు..అలాగే చింతమనేని ఎన్నిసార్లు జైలుకు వెళ్లారో చెప్పాల్సిన పని లేదు. ఇటు యరపతినేనికి వైసీపీ ఎలా చుక్కలు చూపించిందో తెలిసిందే. ఇక వీటికి రివెంజ్ తీర్చుకోవాలని చింతమనేని, యరపతినేని ప్లాన్ చేస్తున్నారు.

అటు చింతమనేని..దెందులూరులో గెలవాలని, ఇటు యరపతినేని..గురజాలలో గెలవాలని అనుకుంటున్నారు. ఇక పరిస్తితులు కూడా చూస్తుంటే వారికి అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దెందులూరులో చింతమనేని బాగా పుంజుకున్నారు..ఖచ్చితంగా ఈ సారి దెందులూరులో చింతమనేని గెలిచేలా ఉన్నారు. అటు గురజాలలో యరపతినేని కూడా సత్తా చాటేలా ఉన్నారు..గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చాలావరకు పోటీ ఇచ్చింది..ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గురజాలలో యరపతినేని పైచేయి సాధించేలా ఉన్నారు. మొత్తానికి ఇద్దరు నేతలు గెలిచేవరకు తగ్గేలా లేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: