తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతు రెండు పాయింట్లు చెప్పారు. మొదటిదేమో వైసీపీ విముక్త ఏపీ కావాలట. ఇక రెండోదేమిటంటే తనను క్రిమినల్స్ పాలించకూడదని అనుకుంటారట. ఈ రెండు పాయింట్ల ఆధారంగానే తాను రాజకీయాలు చేస్తున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు. మొదటి పాయింట్ గురించి గతంలో కూడా చెప్పారు. రెండోపాయింటే కొత్తది. అయితే పవన్ ఆలోచన ప్రకారం రెండుపాయింట్లూ ఆచరణ సాధ్యంకాదు.







కాంగ్రెస్ ముక్త భారత్ అని నరేంద్రమోడీ పదేపదే పిలుపిస్తున్నారు. సాధ్యమవుతోందా ? కాంగ్రెస్ పార్టీలేని ఇండియాను జనాలు ఊహించుకోలేరు. కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలు కావచ్చు, లేదా బీజేపీ అదృష్టంకావచ్చు ప్రస్తుతం కమలంపార్టీ బాగా రైజ్ మీదుందంతే. అంతేకానీ దేశం నుండి కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేయటం ఎవరివల్లా కాదు. అలాగే రాష్ట్రంలో వైసీపీ లేని రాజకీయాలను కూడా ఎవరు ఊహించుకునేందుకు లేదు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు వైసీపీనే గెలుచుకోవాలన్న జగన్మోహన్ రెడ్డి కోరిక కూడా తీరనిదే. 







జగన్ కోరిక ఎలాగ తీరదో పవన్ కోరిక కూడా తీరనిదే అని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఇపుడే ఎవరు చెప్పలేరు. ఒకవేళ వైసీపీ ఓడిపోయిందనే అనుకున్నా ఎన్నోకొన్ని సీట్లయితే తెచ్చుకుంటుంది కదా. నియోజకవర్గాల్లో వైసీపీని గెలవనీయకుండా చేయటం పవన్ చేతిలో లేదు. తనపార్టీ ఎన్నికల్లో ఎలాగెలవాలన్న విషయంపైన పవన్ దృష్టిపెడితే బాగుంటుంది. వచ్చే ఎన్నికల్లో జగనే మళ్ళీ గెలిస్తే అప్పుడు టీడీపీ, జనసేన కనుమరుగయ్యే అవకాశముందేమో.







మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. 23 సీట్లకే పరిమితమైనంత మాత్రాన టీడీపీని రాష్ట్రంలో తుడిచిపెట్టేయటం సాధ్యమవుతుందా ? సీట్లు రాకపోవచ్చు క్యాడర్ బలంగా ఉన్న ఏపార్టీని కూడా రాష్ట్రంలో లేకుండా చేయటం సాధ్యంకాదు. వైసీపీ సంగతిని పక్కనపెడితే వచ్చే ఎన్నికల్లో కూడా జనసేనకు సీట్లు రాకపోతే ఏమవుతుంది ? తాను మళ్ళీ ఓడిపోతే పార్టీ పరిస్ధితి ఏమిటి ? అనేది పవన్ ముందుగా ఆలోచించుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: