ప్రత్యేక హోదా గురించి ఎపుదైనా  కనీసం నోరు మెదిపారా అంటూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ పై సూటిగానే బాణాలు వేశారు జగన్. ఇక్కడ నుంచి గెలిచి పార్లమెంట్ కు వెళ్ళిన రాజు గారు అక్కడ కేంద్ర  మంత్రి గా ఏం చేశారో చెప్పాలంటూ గట్టిగానే నిలదీసారు. అది పూసపాటి వారి ఇలాకా. రాజుల జమానా. కానీ జగన్ సభ అంటే జనం గంగవెర్రులెత్తినట్లు పోటెత్తారు. ఈ రోజు రాత్రి పట్టణంలో మూడు లాంతర్ల జంక్షన్ వద్ద జగన్ పెట్టిన మీటింగు అదరహా అదరహా  అన్న లెక్కన సాగింది.


ఏం చేశార‌ని :


టీడీపీని దశాబ్దాలుగా భరించారు. ఓట్లేశారు. ప్రతిగా ఏంచేశారో చెప్పాలంటూ జగన్ ఈ సభ సాక్షిగా జనాన్ని  ప్రశ్నించారు. జిల్లాలో జరిగిన ప్రగతి అంతా నాటి సీఎం వైఎస్ ఘనత మాత్రమేనని అన్నారు. ఏం చేయకుండానే అంతా చేసినట్లు చెప్పుకుంటున్నారని ఆయన చంద్రబాబుని ఎద్దేవా చేశారు. జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్ట్ మొత్తానికి మొత్తంగా వైఎస్సార్ కడితే అది నా ఘనత అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు 


హోదాని పాతరేసారు :


బీజేపీతో నాలుగేళ్ళ పాటు కాపురం చేసిన చంద్రబాబు ఎన్నికలు ఉన్నాయని తెగతెంపులు చేసుకుని ధర్మ పోరాట దీక్షలంటూ నంగి కబుర్లు చెబుతున్నారని జగన్ సెటైర్లు వేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేసిన పాపం నూటికి నూరు శాతం చంద్రబాబుదేనని గట్టిగా చెప్పారు ఆనాడు అరుణ్ జైట్లీ ప్యాకేజ్ అంటే మురిసిపోయి చప్పట్లు కొట్టి సన్మానాలు చేసిన చంద్రబాబు ఇపుడు హోదా అనడం పచ్చి మోసం అన్నారు. 
అసెంబ్లీలో కేంద్రాన్ని అభినందిస్తూ తీర్మానం కూడా చేశారని, ఆహా ఓహో అంటూ పొగిదారని జగన్ గుర్తు చేశారు. ఇపుడు ఓట్ల కోసం కొత్తగా నాటకాలు మొదలుపెట్టారని అటాక్ చేశారు. చంద్రబాబు  హోదాను,  ఏపీని సమాధి చేసేశారని అన్నారు.


పవర్ కట్:


ఇదిల ఉండగా జగన్ సభకు అనూహ్యంగా జనం హాజరు కావడం  ఒక ఎత్తు అయితే మీటింగ్ మధ్యలో కరెంట్ పోవడం మరో ఎత్తు. కావాల‌నే టీడీపీ నాయకులు కరెంట్  కట్ చేశారని వైసీపీ నాయకులు విమర్సించారు మొత్తానికి విజయనగరం జిల్లాలో జగన్ కి జనం నీరాజనం పట్టారు. మూడు లాంతర్ల వద్ద జరిగిన సభకు జనం పోటెత్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: