ఇటీవలే ఎఫ్‌2 సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఎంతటి మగాడైనా ఇంట్లో పిల్లిలాగానే ఉండాల్సి వస్తోందన్నది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ పరిస్థితి సామాన్యులకే కాదు.. మహామహులకూ తప్పడం లేదట. తాజాగా ఆ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఉన్నారట.

Image result for chandrababu and bhuvaneswARI


తన భార్య గురించిన ఈ తమాషాను ఆయన స్వయంగా ఓ కార్యక్రమంలో చెప్పి నవ్వులు పూయించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి హెరిటేజ్ సంస్థను దిగ్విజయంగా నడుపుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు భార్యగా కాక.. ఓ పారిశ్రామికవేత్తగా ఆమె ఎన్నో అవార్డులు అందుకున్నారు.

Related image

జాతీయ స్థాయిలో పురస్కారాలు కూడా పుచ్చుకున్నారు. తన భార్య క్రమశిక్షణ గురించి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు ఆమె గొప్పతనాన్ని ప్రశంసించారు. భువనేశ్వరి ఏ ప్రాజెక్టు చేపట్టినా అది విజయవంతం అయ్యేవరకూ వదలదని కితాబిచ్చారు.

Related image


ఆమె ఏదైనా తలచుకుంటే నన్నే వదిలిపెట్టదు.. ఇక మీ సంగతి ప్రత్యేకంగా చెప్పాలా.. అంటూ సభలో నవ్వులు పూయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చారు. అసలే రాజకీయాలు ఊపందుకున్న కీలక సమయంలోనూ చంద్రబాబు ఈ కార్యక్రమం కోసం సమయం కేటాయించారు. మరి హోం మినిస్టర్ ఆదేశాలు చీఫ్ మినిస్టర్ అయినా పాటించాల్సిందే కదా..!


మరింత సమాచారం తెలుసుకోండి: