నమ్ముకున్న వాళ్లను వైఎస్ ఫ్యామిలీ ఎప్పుడూ అండగానే ఉంటుందన్న పేరు ఇప్పటివరకూ ఉంది. ఇందుకు చరిత్రలో అనేక ఉదాహహరణలు ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో నిదర్శనం జతపడింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో ఫేమస్ అయిన కమెడియన్ పృథ్వీ వైసీపీలో చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.


మొన్నటి ఎన్నికల్లోనూ ఆయన జోరుగా ప్రచారం చేశారు. ఇప్పడు వైసీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జగన్ ఆయనకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పృధ్వీ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.


ఆయనకు ఇప్పుడు శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వీని జగన్ నియమించబోతున్నారట. ఈ విషయమై జగన్ ఇప్పటికే పృథ్వీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పృథ్వీకి ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి అప్పగిస్తే.. నమ్ముకున్న వాళ్లకు జగన్ ఏదో ఒకటి చేస్తాడన్న పేరు నిలబడే అవకాశం ఉంది. ఇప్పటికే అలీకి ఎమ్మెల్సీ సీటు ఖాయమైందని వార్తలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: