హుజూర్‌నగర్ ‌ఉపఎన్నికలో బంపర్ మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తుందని విజయకేతనం ఎగురవేసే దిశగా అడుగులేస్తున్న  అధికార పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద  మాట్లాడిన ఆయన.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పథకాలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాయన్నారు. కాగా.. తొలి రౌండ్ మొదలుకుని  పూర్తయ్యే వరకూ కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగా భారీ ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం.. టీఆర్ఎస్‌కు దరిదాపుల్లోకి కూడా రాలేదు.



మరోవైపు టీడీపీ, బీజేపీ అభ్యర్థుల పరిస్థితి గురించి ఇక ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కారు స్పీడుతో కాంగ్రెస్ కంచుకోటకు బీటలు మారుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తే.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో కారు జోరుకు 'హస్త'గతి తప్పింది. నిన్న మొన్నటి వరకు  కాంగ్రెస్ కంచుకోట గా నిలిచిస్తు వచ్చిన  హుజూర్ నగర్ లో గులాబీ దండు విజయకేతనాన్ని ఎగురవేసింది. ఈ ఉప ఎన్నిక ప్రతి రౌండ్ లోను గులాబీ పార్టీనే ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఏడో రౌండ్  కౌంటింగ్  ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి 14వేలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.
కారు జోరు ముందు బోల్తా పడ్డ కాంగ్రెస్..భారీ మెజార్టీ దిశగా టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కొనసాగుతున్నారు. ఫలితాల సారని చూస్తున్న ఆయన 50 వేళా ఓట్లతో గెలవడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.  ఈ క్రమంలో  టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. తొలి రౌండ్ ప్రారంభం నుంచే టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల జోష్ మొదలైంది. కౌంటింగ్ కేంద్రం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. హుజూర్‌నగర్‌లోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, సైదిరెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని అప్పుడే స్వీట్స్ పంచుకుని.. బాణాసంచాలు పేల్చుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: