బొత్స సత్యనారాయణ సీనియర్ నేత ఇందులో ఎవరికీ సందేహం లేదు. అయితే రాజకీయాల్లో సీనియారిటీకి ఎపుడూ సంబంధం లేదు. ఎపుడు వచ్చామ‌ని కాదు, బుల్లెట్ దిగిందా లేదా  అన్నదే ఇక్కడ ప్రధానం . ఆ మాటకు వస్తే ఎంతో మంది సీనియర్లు ఏమీ కాకుండా బ్యాక్ బెంచ్ కి వెళ్ళిపోయారు కూడా. చాలా మందితో పోలిస్తే బొత్స అద్రుష్టవంతుడే. రాజకీయంగా ఆయనకు పట్టు అంతా విజయనగరం జిల్లాలో  మాత్రమే. కానీ ఆయన ఏపీలో సీనియర్ నేతల్లో ఒకరిగా ఉన్నారు.


సరే ఇదంతా ఎందుకంటే బొత్స తన స్థాయికి వైసీపీ చిన్నదని పదే పదే చెప్పుకుని బాధపడిపోతున్నారు. ఆ మాటకు వస్తే చంద్రబాబు ఎన్ని విధాలుగా బాధపడాలి. ఆయన ఉమ్మడి ఏపీకి సీఎం రెండు సార్లు చేసిన వారు. అటువంటి బాబు అయిదేళ్ల పాటు పదమూడు జిల్లాల సీఎంగా పనిచేశారు. ఇపుడు అది కూడా పోయింది. వైసీపీలో చూస్తే  ఇంకా చాలా మంది సీనియర్లకు మంత్రి పదవులు కూడా రాలేదు.


బొత్సకు జగన్ అన్ని విధాలుగా విలువ ఇస్తున్నారు. ఆయన కుటుంబానికి కూడా టికెట్లు ఇచ్చారు. అయినా బొత్సలో అసంత్రుప్తి ఓ రేంజిలో ఉంది. దానికి కారణం ఆయనకి కనీసం డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదని, ముఖ్యమంత్రి కాకపోతిని, కనీసం ఉప ముఖ్యమంత్రిని అనిపించుకోలేకపోయానేనని సత్తిబాబు తెగ ఫీల్ అవుతున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వకపోతే పోయారు. అతి పిన్న వయస్కురాలు అదే విజయనగరం జిల్లాలో ఉన్న పుష్ప శ్రీవాణికి పదవి ఇచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం చూస్తే ఆమెకే తొలి ప్రాధాన్యం. దాంతో తట్టుకోలేకపోతున్నారుట బొత్స సార్. మరి దీనికి జగన్ ఏం చేస్తారు.  ఎవరికి ఎలా ఇవ్వాలో అన్ని చూసి జగన్ పదవులు ఇచ్చారు. అయినా ప్రభుత్వంలో బొత్స మాట బాగానే చలామణీ అవుతోందిగా.



మరింత సమాచారం తెలుసుకోండి: