ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై నేటికి 50 రోజులైంది. ఈ 50 రోజులలో ఆర్టీసీ కార్మికులు కోరిన డిమాండ్లను నెరవేర్చటానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ప్రభుత్వం కార్మికులు విధుల్లో చేరాలని రెండు సార్లు గడువు ఇచ్చినప్పటికీ కార్మికులు విధుల్లో చేరలేదు. హైకోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందనే ఆశతో సమ్మె విరమించని కార్మికులకు హైకోర్టు కేసు తమ పరిధిలోకి రాదని లేబర్ కోర్టు పరిధిలోకి వస్తుందని తీర్పు చెప్పింది. 
 
రెండు వారాల్లో లేబర్ కోర్టు సమస్యను పరిష్కరించాలని తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోవటంతో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రభుత్వం షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ప్రకటన చేశారు. కానీ ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోవటంతో మరలా సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికులు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాటలను నమ్మి మోసపోయారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
50 రోజుల తరువాత సమ్మె విరమించే బదులు ప్రభుత్వం రెండు సార్లు గడువు ఇచ్చిన సమయంలో సమ్మె విరమించవచ్చు కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతల నిర్ణయాల వలన ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరి స్వార్థ రాజకీయాలకు ఆర్టీసీ కార్మికులు బలైపోయారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 
 
జేఏసీ నేతలు 50 రోజులు ఆర్టీసీ కార్మికులతో సమ్మె చేయించి ఏం సాధించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హైకోర్టు తీర్పు అనుకూలంగా రావటంతో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వం విధివిధానాలు రూపొందిస్తోంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అటు ఆర్టీసీ కార్మికులు, ఇటు ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపైనే ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: