ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిలో ప్రకటన చేసిన తర్వాత అమరావతిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల  నిర్మాణానికి వ్యతిరేకంగా అమరావతిలో రైతులు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతులే  కాదు రైతు కుటుంబాలను మొత్తం వచ్చి రోడ్ల మీదికి చేరి నిరసనలు ధర్నాలు చేపడుతున్నారు. అమరావతి మొత్తం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల  నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అమరావతి రైతులు. ఈ క్రమంలో అమరావతి మొత్తం హాట్ హాట్ గా మారిపోయింది. 

 

 

 

 అయితే అమరావతి రైతులు నిరసనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పలు విమర్శలు గుప్పించారు. రైతులకు ఎవరు ఇబ్బంది కలిగించవద్దని  వైసీపీ నేత ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సూచించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రకటన తో అమరావతి రైతుల కంటే ఎక్కువ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆందోళనకు గురవుతున్నారు అంటూ విమర్శించారు. రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు జక్కంపూడి. 

 

 

 రాజధాని రైతులకు పూర్తి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా  తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని... పరిస్థితులను అర్థం చేసుకుని  జగన్ నిర్ణయానికి మద్దతు పలకాలని సూచించారు. రాష్ట్ర పరిస్థితులపై పవన్ కళ్యాణ్ కు కొంతయినా అవగాహన లేదని... పవన్ కళ్యాణ్ తన యాక్టింగ్  ఆపేయాలి అంటూ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలను వదిలేసి సినిమాలు చేసుకుంటే మంచిది అంటూ ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: