ప్రజలకు సంక్షేమ పథకాలు అందివ్వడంలో దివంగత వైఎస్సార్ ఫ్యామిలీ పెట్టింది పేరు. 2004-2009 వరకు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న  వైఎస్సార్ ఏ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేశారో అందరికీ తెలుసు. ఆ పథకాల ఫలితం వలనే వైఎస్సార్ రెండోసారి సీఎం కాగలిగారు. ఇక తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే బాటలో ముందుకెళుతున్నారు. 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్, ఊహించని స్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. కేవలం 8 నెలల పాలన కాలంలోని అనేక అద్భుత పథకాలు అమలు చేశారు.

 

ప్రతిపక్షాలు అన్ని కలిసి విమర్శలు చేసిన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకెళుతున్నారు. అయితే ఇటీవల కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి పేద తల్లి పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో అమ్మఒడి పథకం తీసుకొచ్చారు. జనవరి 9న చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి పేద తల్లి ఎకౌంట్‌లో రూ. 15 వేలు డిపాజిట్ అయ్యాయి. దాదాపు 40 లక్షలకు పైనే కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందాయి. 

 

అయితే ఈ స్థాయిలో పథకం ప్రజల్లోకి వెళ్ళిన, అనుకున్న మేర ప్రచారం రాలేదు. ప్రతిపక్షాలు మూడు రాజధానుల అంశాన్ని రాజకీయం చేయడంతో అమ్మఒడి కాస్త పక్కకు వెళ్లిపోయింది. కానీ ప్రతిపక్షాలు రాజకీయం చేసిన అమ్మఒడి సైలెంట్‌గా మహిళలల్లోకి వెళ్లింది. ఇప్పటికే 8 నెలల్లో జగన్ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు అమలు చేశారు. ఇప్పుడు అమ్మఒడి కూడా అందడంతో జగన్‌కు మహిళల మద్ధతు పెరిగింది. ఆఖరికి ఎన్నికల్లో టీడీపీ, జనసేనలకు ఓటు వేసిన మహిళలకు కూడా అమ్మఒడి అందడంతో వారు కూడా జగన్‌ పట్ల పాజిటివ్‌గా మారారు. ఏదేమైనా ప్రతిపక్షం రాజకీయం చేసిన అమ్మఒడి పథకం మహిళల్లోకి సైలెంట్‌గా వెళ్లిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: