ప్రస్తుతం దేశంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే కరోనా  వైరస్ కేసులు పెరిగిపోతున్నప్పటికి భయపడని  ప్రజానీకం.. ఒకసారి కరోనా  వైరస్ బారినపడి చికిత్స తీసుకుని కోలుకున్న వారికి  మళ్లీ కరోనా సోకుతున్న కేసులతో   భయపడుతు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఇలా రెండవసారి కరోనా  వైరస్ సోకిన కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి మొదటి కేసు నమోదయ్యింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శరవేగంగా కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతూ కరోనా  కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే.



 దీంతో ప్రజలందరిలో తీవ్ర ఆందోళన పెరిగిపోతుంది. ఇక ఇప్పటికే కరోనా  వైరస్ కేసులతో భయాందోళనలో మునిగిపోతున్న ప్రజలు ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కరోనా  సెకండ్  వేవ్  స్టార్ట్ అయిందేమో అని మరింత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇటీవలే రెండవసారి కరోనా  వైరస్ బారిన పడిన కేసు నమోదయ్యింది. రెండోసారి కరోనా  వైరస్ బారిన పడింది  ఎవరో కాదు ఏకంగా ఒక ఎమ్మెల్యే . చిత్తూరు జిల్లా తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండోసారి కరోనా  వ్యాధి బారిన పడ్డారు .



 ఇటీవల తిరుపతిలోని ఓ ప్రైవేట్ ల్యాబ్ లో నిర్వహించిన పరీక్షల్లో  ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఆగస్టులో వైరస్ బారిన పడిన సదరు ఎమ్మెల్యే.. చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పుడు మరో సారి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి కరోనా బారిన పడడం కలకలం రేపింది. ఇలాంటి కేసులు రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో ఇక రెండవ సారి కూడా కరోనా వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్  అయింది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే పెరిగిపోతున్న కరోనా  కేసులతో ప్రజలు ఆందోళన చెందుతుంటే ఇక సెకండ్  వేవ్ అని విశ్లేషకులు చెబుతుండటంతో  మరింత భయాందోళనలో మునిగిపోతున్నారు రాష్ట్ర ప్రజానీకం.

మరింత సమాచారం తెలుసుకోండి: