ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీనివలన పార్టీ అంతిమంగా నష్టపోతుంది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సరే పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ఇప్పుడు చాలా వరకు కూడా పార్టీ నష్టపోతుందని ప్రజల్లోకి వెళ్లడానికి సీఎం జగన్ ఎంతో కష్టపడుతున్నారు అని అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆయన చాలా సమర్థవంతంగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

చిన్నచిన్న వ్యవహారాల కారణంగా పార్టీ పరువు పోతుంది అనే భావన చాలా వరకు కూడా పార్టీ అధిష్టానం లో ఉంది. కొంతమంది స్థానిక నాయకులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని సీఎం జగన్ వద్దకు సమాచారం కూడా వెళ్ళింది. అనవసర వివాదాల్లోకి తలదూర్చడం తో పార్టీ ఎక్కువగా నష్టపోతున్నది అని అంటున్నారు. దీనితో ఇప్పుడు సీఎం జగన్ నివారణ చర్యలకు దిగుతున్నారు. ఇకనుంచి చూసీచూడనట్లు వ్యవహరించడం వద్దు అనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు కూడా కేసులు నమోదు చేసే విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గదని దూకుడు వెళ్ళాలి అనే సీఎం జగన్ ఇప్పుడు సూచనలు చేస్తున్నారు.

త్వరలోనే ఆయన డీజీపీతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఇలాగే నాశనం అయిపోయింది ఇప్పుడు మనం కూడా ఇలాగే నాయకులు కారణంగా నాశనం అయిపోతామని కాబట్టి వైసిపి కార్యకర్తలు తప్పులు చేసినా సరే ఎక్కడ కూడా క్షమించ వద్దు అని అదేవిధంగా నాయకులు కూడా ఎక్కడా కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించ వద్దు అని సీఎం జగన్ సూచన చేస్తున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లాలి అనుకుంటున్నా కాబట్టి ఇలాంటి చర్యల ద్వారా పార్టీ నష్ట పోకుండా జాగ్రత్త పడాలి అని ఆయన కొంతమంది కీలక నేతల వద్ద కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: