సాధారణంగా చలికాలం వచ్చిందంటే చాలు ఎక్కడికక్కడ చలి నుంచి తప్పించుకొని కాస్త వేడిగా అవడానికి చలిమంట వేసుకుంటూ ఉంటారు చాలామంది. ఇక ఈ మధ్య కాలంలో చలితీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో చలిమంటలు వేసుకొని చుట్టూ కూర్చుని ముచ్చట్లు పెట్టే వారి సంఖ్య ఎక్కువవుతోంది. గంటల తరబడి ఇలా చలిమంటల చుట్టూ చేరి పోతూ ఉంటారు ఎంతో మంది. అయితే చలిమంటల విషయంలో కాస్త ఏమరుపాటుగా ఉంటే చివరికి చలిమంట చితి మంట గా మారుతుంది అన్నది ఇక్కడ జరిగిన ఘటన చూస్తే అర్థమవుతుంది.  చలి నుంచి ఉపశమనం కోసం ఏర్పాటు చేసుకున్న మంట  చివరికి ఆ మహిళకు చితి మంటగా మారిపోయింది.


 చివరికి సజీవదహనం అయింది వృద్ధ గిరిజన మహిళ. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోపాల్ పూర్ అటవీ ఈ ప్రాంతంలో నివసించే  ఒక వృద్ధ గిరిజన మహిళ తన పత్తి పొలంలో చలిమంటలు వేసుకుంది.  ఈ క్రమంలోనే చూస్తుండగానే అకస్మాత్తుగా చలిమంటలు ఆమె కప్పుకున్న దుప్పటి అంటుకున్నాయి.  అటు పత్తి కుప్పల కు కూడా మంటలు అంటుకున్నాయి.  దీంతో పత్తి పంటకు అంటుకున్న మంటలు ఆర్పే క్రమంలో సదరు వృద్ధురాలు సజీవదహనం అయిపోయింది.



 అయితే పక్క చేను లో ఉన్న రైతులు ఈ విషయాన్ని గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక సంఘటనా స్థలానికి హుటాహుటిన కుటుంబసభ్యులు చేరుకునేలోపే వృద్ధురాలు సజీవదహనం అయిపోయింది  ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  అయితే పత్తి పంటకు కాపలాగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చలి మంటలు వేసుకుని కాసేపటి తర్వాత మంటలను ఆర్పి పడుకొనేవారని..  నిన్న కూడా సదరు వృద్ధురాలు ఇలా చేయడంతోనే చలి మంటలు అంటుకొని చివరికి ప్రమాదవశాత్తు సజీవదహనం అయింది అని స్థానికులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: