ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఏపీ ప్రభుత్వం ప్రమోషన్‌ ఇచ్చింది.ఐఏఎస్ అధికారిణి శ్రీలక్షీ ఇటీవలే తెలంగాణ నుంచి డెప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే. అలా బదిలీ అయిన శ్రీలక్ష్మీ తొలుత రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఐతే తాజాగా ఆమెను కార్యదర్శి ర్యాంక్ నుంచి ముఖ్య కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.


శ్రీలక్ష్మి మీద ఉన్న పెండింగ్ కేసుల తీర్పులు, డీవోపీటీ నిర్ణయం మేరకు అమలు జరుగుతుందని, తుది తీర్పులకు లోబడే ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.  తుది తీర్పునకు లోబడే ప్రమోషన్ ఉంటుందని  సీఎస్ స్పస్టం చేశారు. కాగా.. ఏపీకి రావడానికి దాదాపు 20 నెలలపాటు ప్రయత్నించిన అనంతరం విజయం సాధించారు శ్రీలక్ష్మి.క్యాట్ ఆదేశాల మేరకు ఆమెను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. డిప్యుటేషన్ మీద ఆమె తెలంగాణ నుంచి ఏపీకి రావాలని ఆమె తొలుత భావించిప్పికీ.. అది కుదరలేదు. క్యాట్‌ను ఆశ్రయించి.. శ్రీలక్ష్మి తన కేడర్‌ను ఏపీకి మార్పించుకున్నారు.


ఇటీవల ఆమె అమరావతిలోని జీఎడీలో రిపోర్టు చేశారు శ్రీలక్ష్మి డిప్యుటేషన్ మీద తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో శ్రీలక్ష్మిని కేంద్రం తెలంగాణకు కేటాయించింది. వాస్తవానికి ఆమె స్వస్థలం విశాఖపట్నం.  తన తండ్రి రైల్వే జాబ్ కారణంగా.. తాము హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చిందని.. తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు.హైదరాబాద్ పోస్టల్ అడ్రస్ కారణంగా కేంద్రం ఆమెను తెలంగాణకు కేటాయించింది. అప్పటి నుంచి సొంత రాష్ట్రానికి వచ్చేందుకు ఆమె ప్రయత్నాలు చేశారు.కార్యదర్శి, ఆపై స్థాయి అధికారులను డిప్యుటేషన్ మీద ఇతర రాష్ట్రాలకు పంపించడం కుదరదని చెబుతూ శ్రీలక్ష్మి డిప్యుటేషన్ కు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు.చివరకు క్యాట్ ను ఆశ్రయించి విజయం సాధించారు. క్యాట్ అదేశాలతో తెలంగాణ కేడర్ ఐఏఎస్ గా ఉన్న ఆమె ఏపీకి బదిలీ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: