చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా  వైరస్ తో ప్రపంచ దేశాలు మొత్తం అతలాకుతలం అయిపోతున్నాయి  అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఈ మహమ్మారి వైరస్ ను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. ఇక అదే సమయంలో వైరస్ ను పూర్తి స్థాయిలో అంతం చేయడానికి వివిధ దేశాలలో  శరవేగంగా వ్యాక్సిన్  అభివృద్ధి చేసాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక వివిధ దేశాలు అభివృద్ధి చేసిన వ్యాఖ్యలకు అత్యవసర వినియోగం కోసం అనుమతులు కూడా ఇస్తున్నాయి ఆయా దేశాల ప్రభుత్వాలు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.



 అటు భారత్ లో  కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్  తీసుకున్నారు. ఇక ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అటు పేద దేశాల్లో మాత్రం ఇప్పటికీ వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో ఇక తాజాగా దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అన్ని దేశాలు కూడా.. వ్యాక్సిన్  మాకే ముందు అనే ధోరణితో ముందుకు సాగుతున్నాయి అంటూ విమర్శించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ ఆఫ్ జనరల్ టెడ్రోస్.



 ఇక వ్యాక్సిన్  పంపిణీలో ఇప్పటికీ ఎన్నో పేద దేశాలు వెనకబడి ఉన్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటి వరకు వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి 49 ధనిక దేశాలలో నాలుగు కోట్ల మంది ప్రజలకు వాక్సిన్ అందించగా.. పేద దేశాలలో మాత్రం కేవలం 25 మంది మాత్రమే వ్యాక్సిన్ అందింది అంటూ గుర్తు చేశారు. మాకే ముందు  వ్యాక్సిన్  కావాలి అనే ధోరణితో స్వీయ  ఓటమి తప్పదు అంటూ వ్యాఖ్యానించి ఆయన...ప్రపంచ దేశాలు ఇప్పటికే నైతిక వైఫల్యం చెందాయి అంటూ విమర్శలు చేశారు. ఏప్రిల్ 7న జరిగే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాటికి అన్ని దేశాలలో వ్యాక్సిన్ పంపిణీ జరగాలి అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: