చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా  వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత అల్లకల్లోలం సృష్టించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ప్రపంచదేశాలకు శరవేగంగా పాకిపోయి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది ఈ మహమ్మారి.  అయితే ఈ ప్రాణాంతకమైన వైరస్ ను కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేసాయి. అదే సమయంలో ఈ వైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందుకు కూడాతీవ్రంగా శ్రమించారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇక ప్రపంచ దేశాలు వ్యాక్సిన్  అభివృద్ధి చేసి క్లినికల్ ట్రయల్ చేస్తున్న తరుణంలోనే అటు చైనా రష్యా దేశాలు వ్యాక్సిన్ తెరమీదకు తెచ్చి అన్ని దేశాలు ఆశ్చర్యపరిచాయి .



 అయితే మొదట వ్యాక్సిన్  కనుగొన్నామని గొప్పలు చెప్పుకునే ఆ దేశాలకు ప్రస్తుతం వ్యాక్సిన్ విషయంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఏకంగా తాము కనిపెట్టిన వ్యాక్సిన్  తమ దేశంలో కూడా పూర్తిస్థాయిలో వాడుకలో లేని పరిస్థితి ఏర్పడింది మిత్రదేశాలు కూడా ఆ రెండు దేశాల వ్యాక్సిన్ లను  దూరం పెడుతూనే ఉన్నాయి. అయితే ఎప్పుడు భారత్కు సంబంధించిన కీలక సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నించే చైనా సైబర్ దాడులకు పాల్పడుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో విద్యుత్ పై కూడా చైనా సైబర్ దాడి చేసింది  ఇటీవలే వ్యాక్సిన్ కు  సంబంధించి కీలక సమాచారాన్ని దొంగలించేందుకు కూడా చైనా మరోసారి పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.


 అయితే చైనా ఏదైనా సాధించాలి అనుకుంటే సరైన దారిలో వెళ్లకుండా దొడ్డిదారిలో వెళుతూ ఎప్పుడు డబుల్ గేమ్ ఆడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  అయితే భారత్  ఎన్నిసార్లు సరైన సమాధానం చెప్పిన కుక్క తోక వంకర అన్న విధంగా వ్యవహరిస్తూ ఉంటుంది చైనా. వ్యాక్సిన్  విషయంలో కూడా ఇలాగే వ్యవహరించినట్లు తెలుస్తోంది. భారత్ బయోటెక్ సహా సీరం  సంస్థలపై కూడా సైబర్ దాడికి ప్రయత్నం చేసింది అనే విషయం బయటకు వచ్చింది. సైబర్ దాడి చేసి భారత్ వ్యాక్సిన్లను దెబ్బతీసి ఆర్థిక వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేసింది అనే విషయం బయటపడింది. అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ విషయాన్ని బయట పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: