తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు వ్యవహారం ఎప్పుడైతే మొదలైందో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రంగంలోకి దిగారు. మా ఎమ్మెల్యేను అన్యాయంగా ఇరికించారు అని ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణ సర్కార్ పై ఆరోపిస్తే..  ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే పనిలో ఉండి వారితో సంప్రదింపులు జరిపారు అని తెలంగాణ ఆరోపిస్తుంది. మొత్తానికి ఈ సమస్య రెండు రాష్ట్రాల సమస్యగా మారిపోయింది.


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్


ఇలాంటి సమయంలో వీరిద్దరూ ఒకే దగ్గర కలవడం ఒకే వేదికపై కూర్చోవడం అంటేఎలా ఉంటుంది..? నిజమే ఆ సమయం వచ్చింది. . రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో  విందు ఇవ్వబోతున్నారు. ఈ విందుకు సతీసమేతంగా హాజరుకావాలంటూ గవర్నర్ ఆహ్వానించారు.ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య విభేదాలు మరింత పెరిగాయి.   గవర్నర్ విందుకు వారిద్దరూ హాజరై మాట్లాడుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ విందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రులను కూడా ఆహ్వానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: