ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు పనితీరు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్నికొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనకు పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందించే పరిస్థితి ఉండదు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. భవిష్యత్ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా ఉండవచ్చు అనే భావన ఉంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ నాయకులు సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్లకపోయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయక పోయినా సరే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టీడీపీనాయకులు పనితీరుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక అవగాహన లేకుండా ముందుకు వెళితే సమస్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో సర్వేలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

దాదాపు 30 మంది అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు కు సంబంధించి చంద్రబాబు నాయుడు సర్వే నిర్వహించే ఆలోచనలో ఉన్నారని తొలిదశలో 30 నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి త్వరలోనే సర్వే పూర్తి చేసి వాళ్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. కార్యకర్తలతో కూడా చంద్రబాబు నాయుడు నేరుగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కార్యకర్తలు కొంతమంది ఈ మధ్యకాలంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి నియోజకవర్గాల ఇన్చార్జిలు ప్రధాన కారణం అనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారని అంటున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ల ద్వారా పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెప్పించుకొని ఇన్చార్జిని మార్చే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. అంతేకాకుండా పార్లమెంట్ అధ్యక్షులు పనితీరు విషయంలో కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ల విషయంలో కూడా చంద్రబాబు జాగ్రత్తగా ముందడుగు వేసే అవకాశం ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: