తెలంగాణ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు వహిస్తున్నా చంద్రబాబు జపం మాత్రం వదలడం లేదు రేవంత్ రెడ్డి. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను జీర్ణించుకోలేకపోయేటట్టు చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ మారి దాదాపు సంవత్సరం అవుతున్నా.. పసుపు మరక రేవంత్ రెడ్డిని ఇంకా వదలలేదు. మాజీ అధినేతను.. సైకిల్ పార్టీలో తన వ్యవహారాలను మరువలేకపోతున్నారు.
పలు సభలు.. సమావేశాల్లో తెలుగు దేశం ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఒక తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అయి ఉండి.. ఆయన ఇలా మాట్లాడటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశ్చర్యాన్నిరేకెత్తిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ న్యాయం చేసిందని తన ప్రసంగాలలో ప్రస్తావిస్తున్నారు.
అందుకే చాలా సభలు, సమావేశాల్లో సైతం తెలుగుదేశం పార్టీ బడుగుల పార్టీ. బడుగులకు న్యాయం చేసిన పార్టీ అని కూడ అన్నారు. అంతేకాదు కేటీఆర్ తన తండ్రికి తెలియకుండానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారనీ.. చంద్రబాబు కాళ్లు పట్టుకుంటేనే టీడీపీ కేటీఆర్ ను గెలిపించిందని అంటున్నారు.
అయితే ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబుపై తన భక్తిని చాటుకున్నారు రేవంత్ రెడ్డి. ఈ కేసులో చంద్రబాబు దగ్గరికి వెళ్లాలంటే ముందు తనను దాటే వెళ్లాలి అంటూ.. చంద్రబాబుపై తనకు ఎంత అభిమానముందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అంతేకాదు తెలుగు దేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డమీద అంటూ చెలరేగిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీ మారినా ఆయన తీరు మాత్రం మారడం లేదు. తెలుగు దేశం పార్టీ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై తన ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి