కానీ వడ్డన ఉంది
ఛార్జీల వడ్డన సర్దుబాటు పేరిట ఉంది
కనుక వినియోగదారులు సర్దుకుపోవాల్సిందే అని చెబుతోంది ఈపీడీసీఎల్.. లోటును సరిచేసేందుకు ఈ భారం తప్పదు అని తే ల్చి చెబుతోంది. లోటు సవరించేందుకు, డిస్కంల భారం తగ్గించేందుకు ఈ పాటి వడ్డన తప్పద ని సర్ది చెబుతోంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కోట్లకు పైగా సర్దుబాటు పేరిట వసూలుకు ఈ నెల నుంచే రంగం సిద్ధమవగా, దీనిపై స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వ వర్గాలు కూడా ఎప్పటికప్పుడు వివరాలతో సిద్ధం అవుతున్నాయి.
సర్దుబాటు ఛార్జీల పేరిట బాదుడు లేకున్నా ఆ బాధ మాత్రం వినియోగదారులకు ఈ నెల తెలిసివచ్చింది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన వినియోగదారులు ఇతర ప్రాంతాల కన్నా కాస్త భారం తక్కువ మోస్తున్నప్పటికీ శ్రీకాకుళం జిల్లాపై ఈ భారం విలువ ఎంతన్నది స్పష్టంగా తేలిపోయింది. ఆ వివరం ఈ కథనంలో..!
విద్యుత్ బిల్లులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎందుకనో వామపక్షాలు ఈ సారి మూగనోము పట్టాయి. ఇందు కు కారణాలు ఎలా ఉన్నా వినియోగ భారం మాత్రం ఈ సారి భారీగానే ఉండనుంది. సాధారణ వినియోగదారులకు వంద నుంచి 111 రూపాయల బాదుడు ఉంది. ఇంకా చెప్పాలంటే వంద యూనిట్లు వాడే వారికి కూడా భారం కనిపిస్తున్నా అది పెద్ద మొత్తం కాదని అధికార వర్గాలు కొట్టిపడేస్తున్నాయి. మినిమం ఛార్జీలు చూసుకున్నా 90 రూపాయలు వచ్చే బిల్లు ఈ సారి 106 రూపా యలుగా తేలింది.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 111 యూనిట్లు వాడకం ఉన్నవారికి 406 రూపాయలు బిల్లు రాగా ఇదే వినియోగదారుడు గత నెలలో 100 యూనిట్లు వాడితే 311 రూపాయలు వచ్చింది. అదేవిధంగా అతి సామాన్యంగా పడే విద్యుత్ బిల్లు చూద్దాం. 43 యూనిట్లు వాడిన ఓ ఇల్లుకు గత నెలలో 95 రూపాయలు వస్తే ఇప్పుడు అదే 43 యూనిట్లకు 114 రూపాయలు వచ్చింది. ఓ చోట 95 రూపాయలు తేడా ఉంది. మరో చోట సాధారణ వినియోగానికి బంధించి 19 రూపాయలు తేడా ఉంది.
ఈ లెక్కన సాధారణ వినియోగదారుడికి కూడా కాస్త పెంచిన ప్రభుత్వం తూర్పు ప్రాంతంలో సర్దుబాటు ఛార్జీల పేరిట 44 పైసలు చొ ప్పున అదనంగా సెప్టెంబర్ నెల నుంచి ఎనిమిది నెలల పాటు వసూలు చేసేందుకు డిస్కంలంకు అనుమతి ఇచ్చిందని శ్రీకాకు ళం ఎస్ ఈ మహేంద్ర నాథ్ తెలిపారు. అన్ని లెక్కలూ చూసుకుంటే జిల్లాపై ఆరు కోట్లకుపైగా భారం అని తేలింది. నెలకు 6.6 కోట్ల చొ ప్పున ఎనిమిది నెలల పాటూ వినియోగదారులు సర్దుబాటు చార్జీలను డిస్కంలకు చెల్లించేందుకు సిద్ధం కావాల్సిందే అని తేలింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి